హాక్వీన్స్‌

ప్రధానాంశాలు

హాక్వీన్స్‌

చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిల జట్టు
తొలిసారి ఒలింపిక్స్‌ హాకీ సెమీస్‌లో ప్రవేశం   

 

సోమవారం.. ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ క్వార్టర్స్‌ మ్యాచ్‌.. ప్రత్యర్థి పటిష్ఠమైన ఆస్ట్రేలియా.. మూడు సార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఆ జట్టుతో పోరులో గెలుపు సంగతి పక్కనపెడితే.. మన అమ్మాయిలు కనీస పోటీనిస్తారా? అనే అనుమానాలు.. ఇక్కడితో టోక్యోలో భారత మహిళల హాకీ ప్రయాణం ముగుస్తుందనే అంచనాల మధ్య మ్యాచ్‌ మొదలైంది. నిమిషాలు గడుస్తున్నాయి.. క్వార్టర్స్‌ ముగుస్తున్నాయి.. మ్యాచ్‌ పూర్తయింది. తీరా ఫలితం చూస్తే.. ఆశ్చర్యం.. అనూహ్యం.. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేలా భారత జట్టు 1-0తో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించింది. అవును.. ఆత్మవిశ్వాసం ఆయుధంగా మన అమ్మాయిలు అద్భుతాన్ని అందుకున్నారు. ఒలింపిక్స్‌ మహిళల హాకీలో తొలిసారి సెమీస్‌ చేరి నవశకానికి నాంది పలికారు. దేశానికి మాటలకందని సంతోషాన్ని పంచారు. పసిడికి రెండు అడుగుల దూరంలో నిలిచారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని