24 మంది సభ్యులతో తితిదే పాలకమండలి

ప్రధానాంశాలు

24 మంది సభ్యులతో తితిదే పాలకమండలి

ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 50 మంది
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో 24 మంది సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. ఈ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌లను నియమిస్తూ మరో ఉత్వర్వును జారీ చేసింది. వీరిద్దరికీ బోర్డులో ఓటింగ్‌ హక్కు లేనప్పటికీ, సభ్యుల్లాగే ప్రొటోకాల్‌ ఉంటుందని పేర్కొంది. మరోవైపు గతంలో ఎప్పుడూ లేనంతగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది.

బోర్డు సభ్యుల సంఖ్యను పెంచనున్నారని కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం సాగింది. పలు ప్రతిపాదనలపైనా ముఖ్యమంత్రి వద్ద చర్చలూ జరిగాయి. బుధవారం కూడా వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. రకరకాల చర్చల తర్వాత పాత బోర్డులాగే సభ్యుల సంఖ్యను 25గానే కొనసాగించాలని నిర్ణయించారు. గత పాలకమండలిలో సభ్యులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు శ్రీనివాసన్‌, జూపల్లి రామేశ్వరరావు, పార్థసారథిరెడ్డిలను కొనసాగించారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భార్య ప్రశాంతిరెడ్డి, తెలంగాణ నుంచి మూరంశెట్టి రాములు, లక్ష్మీనారాయణ తదితరులకు వరుసగా రెండోసారి అవకాశం దక్కింది. పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుకు కొత్తగా అవకాశం కల్పించారు. గత బోర్డులో సభ్యులుగా పనిచేసిన ముగ్గురు ఎమ్మెల్యేల స్థానంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌లకు చోటు కల్పించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి ఒక్కో ఎమ్మెల్యేను బోర్డులో నియమించారు. తితిదే ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకమనేది ముఖ్యమంత్రి, ప్రభుత్వ నిర్ణయమేనని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రత్యేక ఆహ్వానితులకు బోర్డు సభ్యులతో సమానంగా దర్శన అవకాశం ఉంటుందని, బోర్డు సమావేశాలతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు.

సభ్యులు వీరే

పోకల అశోక్‌, మల్లాడి కృష్ణారావు, టంగుటూరు మారుతిప్రసాద్‌, మన్నే జీవన్‌రెడ్డి, డాక్టర్‌ బండి పార్థసారథిరెడ్డి, డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు, ఎన్‌.శ్రీనివాసన్‌, రాజేష్‌శర్మ, బి.సౌరభ్‌, మురంశెట్టి రాములు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (ఎమ్మెల్యే), ఏపీ నందకుమార్‌, పచ్చిపాల సనత్‌కుమార్‌, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌, బూదాటి లక్ష్మీనారాయణ, మిలింద్‌ కేశవ్‌ నర్వేకర్‌, ఎంఎన్‌ శశిధర్‌, అల్లూరి మల్లేశ్వరి, డాక్టర్‌ ఎస్‌.శంకర్‌, ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌రెడ్డి(ఎమ్మెల్యే), బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ (ఎమ్మెల్యే, కనిగిరి), కిలివేటి సంజీవయ్య (ఎమ్మెల్యే, సూళ్లూరుపేట), కాటసాని రాంభూపాల్‌ రెడ్డి (ఎమ్మెల్యే, పాణ్యం)

ఎక్స్‌ అఫీషియో సభ్యులు: రెవెన్యూ శాఖ కార్యదర్శి (దేవాదాయ), దేవాదాయ శాఖ కమిషనర్‌, తుడా ఛైర్మన్‌. తితిదే ఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.


తితిదేకి 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు

ఈనాడు, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీవారి దర్శనానికి సంబంధించినంత వరకు వారిని తితిదే పాలకమండలి సభ్యులతో సమానంగా పరిగణిస్తారని తెలిపింది. ఇప్పుడు నియమించిన తితిదే పాలకమండలి పదవీకాలంతో పాటు, తితిదే ప్రత్యేక ఆహ్వానితుల పదవీకాలమూ ముగుస్తుందని పేర్కొంది.

ప్రత్యేక ఆహ్వానితులు వీరే..

1. కుందవరపు శ్రీనివాస్‌ నాయుడు
2. రాచుపల్లి వెంకట సుబ్బారెడ్డి
3. బద్వేలు సుబ్బారెడ్డి
4. కావేరి భాస్కరరావు
5. డా.సంపత్‌ రవినారాయణన్‌
6. మురళి మహేశ్వరరాజు
7. రమేష్‌ శెట్టి
8. పొంగులేటి ప్రసాద్‌రెడ్డి
9. యెలిశాల రవిప్రసాద్‌
10. బీరేంద్రవర్మ
11. మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి
12. దుష్మంత్‌కుమార్‌ దాస్‌
13. అమోల్‌ కాలే
14. రాధాకృష్ణ ఆడిగ
15. ఆర్‌.గోవిందహరి
16. నరేష్‌కుమార్‌ అగర్వాల్‌ (లల్లు)
17. ప్రసాద్‌వర్మ
18. సాముల రామ్‌రెడ్డి
19. డా.బాలకృష్ణ రాజా
20. సిద్దార్థ లాడే
21. గోవిందరాజులు
22. డా.ఎన్‌.కన్నయ్య
23. జీఆర్‌ కృష్ణ
24. ఆతుకూరి ఆంజనేయులు
25. మంజునాథ్‌
26. డా.టి.ఎ.శ్రవణ
27. జి.రామచంద్రమూర్తి
28. దాట్ల రంగవతి (రంగమ్మ)
29. దాసరి కిరణ్‌కుమార్‌
30. కోమటిరెడ్డి లక్ష్మి
31. శంభుప్రసాద్‌ మహంత్‌
32. ముక్కా రూపానందరెడ్డి
33. కుమారగురు
34. తాడిశెట్టి మురళి
35. పైడా కృష్ణప్రసాద్‌
36. కుపేందర్‌రెడ్డి
37. దాసరి వెంకటరామకృష్ణ ప్రసాద్‌
38. పోతిరెడ్డి నాగార్జునరెడ్డి
39. చింతకుంట సత్యనారాయణ
40. పుత్తా ప్రతాప్‌రెడ్డి
41. కొలిశెట్టి శివకుమార్‌
42. డి.జనార్దన్‌రెడ్డి
43. కట్టా సింగయ్య
44. విజయ్‌కుమార్‌ గురూజీ
45. కె.ఎం.శివశంకరాచారి
46. నాదెండ్ల సుబ్బారావు
47. ఆర్‌.గుర్నాథ్‌రెడ్డి
48. దాసెట్టి సుబ్రహ్మణ్యం
49. దాసరి మురళీకృష్ణ
50. అవినాష్‌గౌడ్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని