సరకు రవాణాకు ‘ఆర్టీసీ లారీ’లు

ప్రధానాంశాలు

సరకు రవాణాకు ‘ఆర్టీసీ లారీ’లు

ఓపెన్‌టాప్‌తో 10 బస్సులు అందుబాటులో

ఈనాడు, హైదరాబాద్‌: కార్గో సేవలను విస్తృతం చేసేందుకు  టీఎస్‌ఆర్టీసీ కొన్ని బస్సులను పూర్తిస్థాయి లారీలుగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయోగాత్మకంగా పది బస్సులను ఓపెన్‌టాప్‌ లారీలుగా మార్చి సిమెంటుతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లను సైతం రవాణా చేస్తోంది. ప్రస్తుతం కార్గో సేవల కోసం సంస్థ 185 బస్సులను వినియోగిస్తోంది. ఇటీవల పది బస్సులను ఓపెన్‌ టాప్‌ లారీలుగా మార్చి సరకు రవాణాకు అందుబాటులో ఉంచడంతో ఈ వాహనాల సంఖ్య 195కు చేరింది. ఆదరణ బాగుండడంతో మరో 50 కార్గో వాహనాల కొనుగోలుకు నిర్ణయించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇటీవల అసెంబ్లీలో సైతం ఈ విషయాన్ని ప్రకటించారు. కార్గో బుకింగ్స్‌ కోసం వచ్చే నెల నుంచి బస్‌ డిపోలు, బుకింగ్‌ ఏజెంట్లకు టికెట్‌ జారీ యంత్రాలను అందించనున్నారు. ఇకపై రాష్ట్రంలోని సుమారు 37 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు నేరుగా ఆర్టీసీ కార్గో ద్వారా బియ్యం, విజయా నూనె, ఇతర ఉత్పత్తులను అందజేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని