close

తాజా వార్తలు

అమిత్‌షా మా దేశంలో ఉంటే తెలుస్తుంది

ఢాకా: జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా లౌకికవాద దేశంగా ఉన్న భారత్‌ పేరు మసగబారే అవకాశం ఉందని బంగ్లాదేశ్‌ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఏకే అబ్దుల్‌ మోమన్‌ పేర్కొన్నారు. ‘భారతదేశం లౌకికవాదాన్ని విశ్వసిస్తున్న దేశం. కానీ, ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం కారణంగా చారిత్రాత్మకంగా అది బలహీనపడే అవకాశం ఉంది’అని ఆయన అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీరును విమర్శించారు. పీడనకు గురౌవుతున్న మైనార్టీ దేశాల జాబితాలో బంగ్లాదేశ్‌ను చేర్చడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.

‘మతసామరస్యం ఉండే అతి కొద్ది  దేశాల్లో బంగ్లాదేశ్‌ ఒకటిగా ఉంది. భారత్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొన్ని నెలల పాటు బంగ్లాదేశ్‌లో ఉంటే ఆయన మా దేశంలో ఆదర్శనీయమైన మతసామరస్యాన్ని చూస్తారు. భారత్‌ ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. వాటితో పోరాడాలి. స్నేహపూర్వకంగా ఉండే మా మీద వాటిని రుద్దకూడదు. ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలపై దీని ప్రభావం పడకుండా భారత్‌ చూసుకుంటుందని భావిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. పీడనకు గురై అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ల నుంచి శరణార్థులుగా వచ్చే మైనార్టీలకు విద్య, ఉద్యోగం, జీవనోపాధి హక్కు కల్పించడమే లక్ష్యంగా పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.