93.69శాతం మంది కోలుకున్నారు!

తాజా వార్తలు

Published : 22/11/2020 10:00 IST

93.69శాతం మంది కోలుకున్నారు!

దిల్లీ: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో 10,75,326 పరీక్షలు జరపగా.. కొత్తగా 45,209 కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,95,807కి చేరింది. వీరిలో 85,21,617 మంది కోలుకున్నారు. మరో 4,40,962 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల కేసుల సంఖ్య 4.85 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 93.69శాతానికి పెరిగింది. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 13,17,33,134 నమూనాల్ని పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. 

కొత్తగా మహమ్మారి బారిన పడి 501 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,33,227కి ఎగబాకింది. ప్రస్తుతం మరణాల రేటు 1.46 శాతంగా ఉంది. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో 17.74 లక్షల కేసులతో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. నిన్న ఒక్కరోజే అక్కడ 5,760 కేసులు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక తీవ్రత ఎక్కువగా ఉన్న దిల్లీలో గత 24 గంటల్లో 5,879 కేసులు వెలుగుచూశాయి. కొత్తగా మరో 100 మంది మరణించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొత్తగా మరో 400 ఐసీయూ పడకల్ని ఏర్పాటు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని