close

తాజా వార్తలు

Updated : 03/12/2020 19:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పద్మ’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన బాదల్

చండీగఢ్‌: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోన్న రైతులకు మద్దతు ప్రకటిస్తూ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్(92) పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. వారికి మద్దతుగా పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన మొదటి వ్యక్తి ఈయనే. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను కేంద్రం ఆయనకు 2015లో బహూకరించింది.

కాగా, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి కూడా శిరోమణి ఆకాలీదళ్ వైదొలిగిన విషయం తెలిసిందే. అలాగే రైతులకు సంఘీభావం తెలుపుతూ..పంజాబ్‌కు చెందిన క్రీడా ప్రముఖులు కూడా తమ పురస్కారాలు వెనక్కి ఇచ్చేస్తామని ప్రకటించడంతో పాటు, డిసెంబర్ 5న దిల్లీకి వెళ్లి రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతామని  వెల్లడించారుTags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన