రోహింగ్యాల శిబిరంలో భారీ అగ్నిప్రమాదం

తాజా వార్తలు

Updated : 24/03/2021 09:56 IST

రోహింగ్యాల శిబిరంలో భారీ అగ్నిప్రమాదం

15 మంది మృతి.. 400 మంది గల్లంతు

కాక్స్‌ బజార్‌: బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్‌ జిల్లాలోని ఓ రోహింగ్యా శరణార్థుల శిబిరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మంది సజీవదహనమవగా.. 400 మంది ఆచూకీ గల్లంతైంది. మరో 560 మంది గాయపడ్డారు. సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో రోహింగ్యాలు వేసుకున్న వందలాది తాత్కాలిక గుడారాలు కాలిబూడిదయ్యాయి. దీంతో వేలాది మంది శరణార్థులు నిరాశ్రయులయ్యారు. 

నిన్న మధ్యాహ్నం తర్వాత బలుఖాళీ క్యాంప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నించారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇంతటి ఘోర అగ్నిప్రమాదాన్ని మునుపెన్నడూ చూడలేదని బంగ్లాదేశ్‌లోని ఐరాస శరణార్థుల సంస్థ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెప్పారు. 

మయన్మార్‌లో 2017లో సైనికులు చేపట్టిన దాడులతో లక్షలాది మంది రోహింగ్యా ముస్లింలు దేశం విడిచి పారిపోయారు. వారంతా పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో శరణార్థుల శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వీరిని మయన్మార్‌కు తిరిగి పంపించేందుకు బంగ్లా ప్రభుత్వం అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ రోహింగ్యాలు అందుకు ఒప్పుకోలేదు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని