మోదీ,ట్రంప్‌ భేటీలో సీఏఏపై ప్రస్తావన!

తాజా వార్తలు

Updated : 22/02/2020 15:01 IST

మోదీ,ట్రంప్‌ భేటీలో సీఏఏపై ప్రస్తావన!

వాషింగ్టన్‌: మొదటిసారిగా భారత్‌ రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మత విశ్వాసాలు, పౌరసత్వ సవరణ చట్టంపై చర్చ జరుగుతున్న తరుణంలో డొనాల్డ్‌ ట్రంప్‌ వీటిపై మోదీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తాజాగా అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌజ్‌ వెల్లడించింది. ఈపర్యటనలో అత్యంత ముఖ్యమైన మతవిశ్వాసాల అంశం ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని వైట్‌హౌజ్‌ సినియర్‌ అధికారి మీడియాకు వెల్లడించారు. ఈ పర్యటనలో ట్రంప్‌ పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలపై మాట్లాడుతారా?అన్న విలేకరుల ప్రశ్నకు వైట్‌హౌజ్‌ అధికారులు పైవిధంగా స్పందించారు.

చట్ట ప్రకారం అన్నిమతాలను సమానంగా గౌరవించడం, మతవిశ్వాసాలపై స్వేచ్ఛ వంటి అంశాలు భారత రాజ్యంగంలోనే స్పష్టంగా ఉన్నాయని శ్వేతసౌధం అధికారులు గుర్తుచేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలపై, సంప్రదాయాలపై అమెరికాకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. గట్టి పునాదులు కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థ భారత్‌ సొంతమని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే నాలుగు అతిపెద్ద మతాలకు భారత్‌ పుట్టినిల్లు అని గుర్తుచేశారు. అయితే బహిరంగ సభలో, మోదీతో జరిగే చర్చల సమయంలో ప్రత్యేకంగా ఈ అంశాలపై మాట్లడే అవకాశం ఉందని పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని