నిర్భయ కేసు: ‘ఉరి’ స్టేపై మరోసారి విచారణ

తాజా వార్తలు

Published : 02/03/2020 15:23 IST

నిర్భయ కేసు: ‘ఉరి’ స్టేపై మరోసారి విచారణ

పవన్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

దిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో డెత్‌ వారెంట్లపై స్టే ఇచ్చేందుకు కొద్ది సేపటి క్రితం దిల్లీ పటియాల హౌస్‌ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. 

ఉరిశిక్షపై తాను మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నానని, అందువల్ల డెత్‌ వారెంట్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ దోషుల్లో ఒకడైన అక్షయ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పటియాల హౌస్‌ కోర్టు అక్షయ్‌ అభ్యర్థనను కొట్టివేసింది. రేపటి ఉరితీతపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో మరో దోషి పవన్‌ గుప్తా కూడా పిటిషన్‌ దాఖలు చేశాడు. 

ఉరితీత సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పవన్‌ గతవారం సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. నేడు సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో అతడు రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని దోషి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ దిల్లీ కోర్టు దృష్టికి తెచ్చారు. క్షమాభిక్ష అభ్యర్థన రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా ఉరితీతపై స్టే ఇవ్వాలని పవన్‌ న్యాయస్థానాన్ని కోరాడు. 

అయితే పవన్‌ అభ్యర్థనపై దిల్లీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకోడానికి ఎందుకు ఆలస్యం చేశారని దోషి తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఒక వ్యక్తి చేసే తప్పుడు చర్య వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో మీకు తెలియదా అంటూ న్యాయవాదిని నిలదీసింది. మరోవైపు పవన్‌ పిటిషన్‌పై తిహాడ్‌ అధికారులు స్పందిస్తూ.. ‘ఇప్పుడు బంతి ప్రభుత్వం చేతిలో ఉంది.. న్యాయమూర్తి చేయాల్సింది ఏమీ లేదు’ అని వ్యాఖ్యానించారు. వాదనల అనంతరం పవన్‌ పిటిషన్‌పై దిల్లీ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. 

హోంశాఖకు చేరిన క్షమాభిక్ష

ఇదిలా ఉండగా.. పవన్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థన కేంద్ర హోంశాఖకు చేరింది. దీన్ని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. 

ఇవీ చదవండి..

ఉరితీతపై స్టేకు నిరాకరణ

నిర్భయ దోషి క్యురేటివ్‌ పిటిషన్‌ తిరస్కరణ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని