మూడోవంతు జనాభా రెడ్‌జోన్ పరిధిలోనే.. 

తాజా వార్తలు

Published : 03/05/2020 01:11 IST

మూడోవంతు జనాభా రెడ్‌జోన్ పరిధిలోనే.. 

దిల్లీ: దేశ వ్యాప్తంగా కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ను మరో రెండువారాల పాటు పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఏప్రిల్‌ 15న పేర్కొన్న జోన్ల వర్గీకరణతో పోలిస్తే, ప్రస్తుతం రెడ్‌ జోన్లు తగ్గాయి. అయితే గ్రీన్‌ జోన్లు తగ్గి, ఆరెంజ్‌ జోన్లు పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గతనెల 15న 730 జిల్లాలను వర్గీకరించగా, ఈసారి 733 జిల్లాలను పరిగణనలోకి తీసుకొంది.

భారత్‌లో మూడోవంతు జనాభా రెడ్‌జోన్ పరిధిలో ఉన్న 130 జిల్లాల్లోనే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అంటే దేశంలో 400 మిలియన్ల ప్రజలు హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారు. వీరిలో సగం మందికి పైగా కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌.. ఈ నాలుగు రాష్ట్రాల్లోని హాట్‌స్పాట్‌లలో 21కోట్ల మంది ఉన్నారు.

*దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో హాట్‌స్పాట్లు వ్యాప్తించి ఉన్నాయి. 

*దేశంలో అత్యధిక జనసాంద్రత గల 50 జిల్లాల్లో సగం రెడ్‌జోన్లలోనే ఉన్నాయి. 
*దేశంలోని మొత్తం పట్టణాలలో మూడో వంతు.. గ్రామాల్లో ఐదో వంతు రెడ్‌జోన్ల పరిధిలోనే ఉన్నాయి. 
*కొవిడ్‌ మహమ్మారి ఉద్ధృతి అధికంగా ఉండటంతో దేశంలోని అన్ని మెట్రో నగరాలూ రెడ్‌జోన్‌ పరిధిలోనే కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ పూర్తిగా రెడ్‌జోన్‌ పరిధిలోకి వచ్చింది. 
రెడ్‌జోన్‌ జిల్లాల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ్‌ బెంగాల్‌ తొలిస్థానంలో ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని