గంజాయి ధరే బాగుంది.. అనుమతిస్తే సాగు చేస్తా: రైతు వినతికి విస్తుపోయిన అధికారులు

తాజా వార్తలు

Updated : 27/08/2021 09:25 IST

గంజాయి ధరే బాగుంది.. అనుమతిస్తే సాగు చేస్తా: రైతు వినతికి విస్తుపోయిన అధికారులు

పుణె: ‘వ్యవసాయ ఉత్పత్తుల్లో దేనికీ మార్కెట్లో స్థిరమైన ధర లేదు. ప్రభుత్వ నిషేధం ఉన్న గంజాయి ధరకు మాత్రం తిరుగులేదు. మీరు అనుమతిస్తే గంజాయి సాగు చేసుకుంటా’.. అంటూ మహారాష్ట్రలోని సోలాపుర్‌కు చెందిన ఓ రైతు చేసిన వినతిని చూసి ఆ జిల్లా అధికారులు విస్తుపోయారు. తేరుకున్నాక.. రైతు వినతిని పోలీసులకు పంపారు. సోలాపుర్‌ జిల్లా మొహోల్‌ తహసీల్‌కు చెందిన అనిల్‌ పాటిల్‌ అనే రైతు బుధవారం జిల్లా కలెక్టర్‌కు ఈ వినతిపత్రం పంపారు. ‘ఏ పంట సాగు చేసినా గిట్టుబాటు ధర లేనందున, వ్యవసాయంలో నష్టాలు తప్పడం లేదు. రానురాను పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదు. చక్కెర కర్మాగారాలకు అమ్మిన చెరకు బకాయిలు ఇంకా ఇవ్వలేదు. గంజాయికి మంచి ధర ఉన్నందున, మీరు గనక అనుమతిస్తే నాకున్న రెండెకరాల్లో ఆ పంట వేస్తా. సెప్టెంబరు 15లోపు జవాబివ్వండి. ఇవ్వకపోతే మీరు అనుమతి ఇచ్చారనే అనుకొని గంజాయి సాగు ప్రారంభిస్తా. నా మీద ఏ నేరం మోపినా అధికారులే బాధ్యులవుతారు’ అని లేఖలో పేర్కొన్నారు. మొహోల్‌ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ సాయ్‌కర్‌ దీనిపై మాట్లాడుతూ.. రైతు లేఖ ప్రచార ఎత్తుగడగా కొట్టిపారేశారు. గంజాయి సాగు చేస్తే, కేసు పెడతామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని