White House: అమెరికాలో సగం మందికి టీకాలు..!
close

తాజా వార్తలు

Published : 27/05/2021 00:23 IST

White House: అమెరికాలో సగం మందికి టీకాలు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా  వ్యాక్సినేషన్‌లో  ఓ కీలక మైలురాయిని దాటింది. పెద్దల్లో  సగం మంది కనీసం ఒక్క డోసు కొవిడ్‌ టీకా అయినా తీసుకొన్నారని శ్వేతసౌధం అధికారి తెలిపినట్లు ఏఎఫ్‌పీ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ప్రపంచంలోనే అమెరికాలో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన విషయం తెలిసిందే.  ఈ సమయంలో అమెరికాలో ఫైజర్‌ బయోఎన్‌టెక్‌, మోడెర్నా టీకాలు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నడిపించాయి. తొలుత వేగంగా మొదలైన వ్యాక్సినేషన్‌ ఆ తర్వాత ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో వేగం మందగించింది. ఈ క్రమంలో మంగళవారం నాటికి 50శాతం పెద్దలకు కనీసం ఒక డోసును అందించింది.  కానీ సీడీసీ డేటా మాత్రం అంతకంటే ఎక్కువ మందే టీకాలు తీసుకొంటున్న చూపిస్తోంది. సీడీసీ లెక్కల ప్రకారం 61.3శాతం అమెరికాలోని పెద్దవారు కనీసం ఒక డోసు తీసుకోగా.. 49 శాతం మంది రెండు డోసులు తీసుకొన్నట్లు సీఎన్‌ఎన్ కథనంలో ఒక కథనంలో పేర్కొంది. 

అత్యధికంగా వ్యాక్సినేషన్‌ జరిగిన ప్రదేశాల జాబితాలో అలస్కా, కాలిఫోర్నియా,కొలరాడో, డెలావేర్‌, హవాయి, ఐయోవా, మేరీల్యాండ్‌, మాసాచుసెట్స్‌, మిషిగాన్‌, మిన్నెసోటా, నెబ్రాస్కా, న్యూహాంప్‌షైర్‌,న్యూజెర్సీ,న్యూమెక్సికో,న్యూయార్క్‌, ఓరెగాన్‌,పెన్సిల్వేనియా, సౌత్‌డకోటా,వర్జీనీయా, వాషింగ్టన్, విస్కన్సన్‌ ఉన్నాయి. న్యూయార్క్‌ పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని నగర మేయర్‌ బిల్‌ డి బ్లాసియో ఎంఎస్‌ఎన్‌బీసీకు వెల్లడించారు. 

దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు, తీవ్రంగా జబ్బుపడటం, ప్రాణాలు కోల్పోవడం వంటివి చాలా వేగంగా తగ్గిపోయాయని శ్వేతసౌధం కొవిడ్‌-19 సలహాదారు ఆండీ సాల్విట్‌ శుక్రవారం వ్యాఖ్యానించారు. కేసుల సంఖ్య భవిష్యత్తులో మరింత తగ్గిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని