Ventilatorsపై ఆరోపణలు..మోదీ సీరియస్
close

తాజా వార్తలు

Published : 15/05/2021 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ventilatorsపై ఆరోపణలు..మోదీ సీరియస్

వెంటనే ఆడిట్ నిర్వహించాలని ఆదేశం

దిల్లీ: కేంద్రం పంపిణీ చేసిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ వస్తోన్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణించారు. దానికి సంబంధించి వెంటనే ఆడిట్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా వెంటిలేటర్ల అంశం చర్చకు వచ్చింది. 

‘వెంటిలేటర్ల పనితీరుపై పలు రాష్ట్రాల నుంచి వస్తోన్న ఆరోపణలను ప్రధాని తీవ్రంగా పరిగణించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఈ వెంటిలేటర్లపై తక్షణమే ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. అలాగే సరిగా పనిచేస్తోన్న వెంటిలేటర్ల విషయంలో అవసరమైతే ఆరోగ్య కార్యకర్తలకు కొత్తగా శిక్షణ ఇవ్వాలని సూచించారు’ అంటూ కేంద్రప్రభుత్వ ప్రకటన వెల్లడించింది. దాంతో పాటు కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో టెస్టుల సంఖ్యను పెంచాలని మోదీ ఈ సమావేశంలో సూచించారు. స్థానిక కంటైన్‌మెంట్‌ జోన్ల ఆవశ్యతకను ప్రధానంగా ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించేలా, ఆక్సిజన్ కొరత లేకుండా చూసేలా వనరులను పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. పీఎం కేర్స్ నిధులతో పలు రాష్ట్రాలకు కేంద్రం వెంటిలేటర్లను సరఫరా చేసింది. అయితే రాజస్థాన్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఆ వెంటిలేటర్లలో సమస్య తలెత్తినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్విటర్‌లో పేర్కొన్నారు. వాటి సేకరణపై కేంద్ర ఆరోగ్య శాఖ వెంటనే దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని