Delta plus: మహారాష్ట్రలో 5 ‘డెల్టా ప్లస్‌’ మరణాలు

తాజా వార్తలు

Published : 14/08/2021 13:22 IST

Delta plus: మహారాష్ట్రలో 5 ‘డెల్టా ప్లస్‌’ మరణాలు

ముంబయి: దేశంలో మూడో దశ కరోనా ముప్పు పొంచి ఉన్న వేళ.. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ మరణాలు నమోదవుతుండటం ఆందోళనకరంగా మారుతోంది. మహారాష్ట్రలో ఈ వేరియంట్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. అక్కడ మొత్తంగా 66 డెల్టా ప్లస్‌ కేసులు బయటపడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

ముంబయిలో తొలి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ మరణం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఘాట్కోపర్‌ ప్రాంతానికి చెందిన 63 ఏళ్ల వృద్ధురాలు రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ.. వైరస్‌ బారిన పడి జులై 27న మృతిచెందింది. ఆమె నమూనాలు, చికిత్స రికార్డులు విశ్లేషించిన అధికారులు డెల్టా ప్లస్‌తోనే మృతిచెందినట్టు ప్రకటించారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పటివరకు 66 మంది ఈ వేరియంట్‌ బారిన పడగా.. అందులో ఐదుగురు మృతిచెందినట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో రత్నగిరిలో రెండు, రాయ్‌గఢ్‌, బీద్‌, ముంబయిలో ఒక్కో మరణం చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఇక జల్‌గావ్‌లో అత్యధికంగా 13 డెల్టా ప్లస్‌ కేసులు, రత్నగిరిలో 12, ముంబయిలో 11 కేసులు బయటపడ్డాయి. ఠాణె, పుణె, పాల్ఘర్‌, నాందేడ్‌ జిల్లాల్లోనూ ఈ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.

కాగా.. డెల్టా ప్లస్‌ సోకిన వారిలో 10 మంది రెండు డోసులు, 8 మంది తొలి డోసు తీసుకున్నారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక ఏడుగురు బాధితులు 18ఏళ్ల లోపు వారు అని పేర్కొంది. బాధితుల్లో 61 మంది ఇప్పటికే కోలుకున్నారని తెలిపింది. డెల్టాతో పోలిస్తే డెల్టా ప్లస్‌కు మరింత వేగంగా వ్యాపించే స్వభావం ఉంది. ఈ వేరియంట్‌ను కేంద్రం ఇప్పటికే ఆందోళనకర రకంగా గుర్తించిన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని