Modi: టీకాతో మీరంతా బాహుబలులుగా మారారు

తాజా వార్తలు

Updated : 19/07/2021 11:01 IST

Modi: టీకాతో మీరంతా బాహుబలులుగా మారారు

పార్లమెంట్‌ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని

దిల్లీ: కొవిడ్ నిబంధనల మధ్య.. సోమవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీకా ప్రాముఖ్యతను వివరించారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

‘మీరంతా కనీసం ఒక్కడోసు టీకా అయినా తీసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. దీంతో 40 కోట్లకుపైగా ప్రజలు బాహుబలులుగా మారారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అభ్యర్థిస్తున్నాను. అలాగే కొవిడ్-19 కట్టడి చర్యలపై ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడుతున్నాను. ఈ సమావేశాల్లో నేను అదే చేయాలనుకుంటున్నాను. ఈ పార్లమెంట్‌ సమావేశాలు ఫలవంతంగా సాగాలని, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు లభించాలని ఆశిస్తున్నాను. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని ప్రధాని వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని