దిశారవికి మరో మూడు రోజుల కస్టడీ

తాజా వార్తలు

Published : 19/02/2021 18:44 IST

దిశారవికి మరో మూడు రోజుల కస్టడీ

దిల్లీ: ట్విటర్‌లో పర్యావరణవేత్త గ్రెటా థెన్‌బర్గ్‌ షేర్‌ చేసిన ‘టూల్‌ కిట్‌’ కేసులో అరెస్టైన సామాజిక కార్యకర్త దిశరవికి మరో మూడు రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ పటియాలా కోర్టు ఉత్తర్వులిచ్చింది. శుక్రవారం దిశరవిని కోర్టులో హాజరు పరిచిన దిల్లీ పోలీసులు మరో మూడు రోజుల పాటు ఆమె కస్టడీని కోరుతూ విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 22న ఈ కేసులో సహ నిందితుడైన శంతను ములుక్‌తో కలిపి విచారణ చేసేందుకు కస్టడీని పొడిగించాల్సిందిగా పోలీసుల తరపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు తెలిపారు.

స్వీడన్‌కు చెందిన పర్యావరణవేత్త గ్రెటా థెన్‌బర్గ్‌ షేర్‌ చేసిన టూల్‌కిట్‌ను రూపొందించడంలో సామాజిక కార్యకర్త దిశ రవితో పాటు నికితా జాకబ్‌, శంతను ములుక్‌లు పాలుపంచుకున్నారని దిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా నికితా జాకబ్‌, శంతనులకు పోలీసుల వినతి మేరకు దిల్లీ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయగా వారిరువురూ తాజాగా ట్రాన్సిట్‌ బెయిల్‌ పొందారు.

మరోవైపు తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు లీక్‌ చేయకుండా చూడాలంటూ దిశ ఓ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వర్గాల నుంచి ధ్రువీకరించుకున్న తర్వాతే ప్రచురించాలని దిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని