​​​​​​రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి గాయాలు
close

తాజా వార్తలు

Published : 09/05/2021 21:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

​​​​​​రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి గాయాలు

బాలాసోర్‌: ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా నీలగిరి ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి ప్రతాప్‌ చంద్ర సారంగి స్వల్పంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఆయన ఓ కుటుంబానికి సాయం చేసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కేంద్రమంత్రిని  ఆసుపత్రికి తరలించారు. ఆయనతో పాటు పీఏ, కారు డ్రైవర్‌, వ్యక్తిగత భద్రతాధికారికి కూడా గాయాలయ్యాయి. ట్రాక్టర్‌ అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు కారణమైన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని