close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముగింపునకు దగ్గర్లో కూడా లేం

ఇప్పుడప్పుడే ‘కరోనా’ అంతం కాదు
సుదీర్ఘకాలం నిరీక్షించాల్సిందే
డబ్ల్యూహెచ్‌వో అధిపతి టెడ్రోస్‌ వ్యాఖ్యలు

ఐక్యరాజ్యసమితి: కరోనా వైరస్‌కు అంతం ఎప్పుడు? ప్రపంచమంతా సమాధానం కోసం ఎదురు చూస్తున్న ప్రశ్న ఇది. అయితే ఈ మహమ్మారికి అంతం దగ్గర్లో లేదంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి టెడ్రోస్‌ అద్నామ్‌ గెబ్రియేసిస్‌. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోందని... ఇప్పుడప్పుడే ఈ వైరస్‌ అంతం కాదని  తేల్చిచెప్పారు. సుదీర్ఘ నిరీక్షణ తప్పదన్నారు. ‘‘ఇది ముగిసిపోవాలని మనందరం కోరుకుంటున్నాం. ఎప్పట్లానే మన జీవితాలను గడపాలనుకుంటున్నాం. కానీ ఇది అంత తొందరగా అంతం కాదు. కఠోర వాస్తవమేంటంటే.. కనీసం మనం ముగింపునకు కూడా దగ్గర్లో లేం. ఈ వైరస్‌ను అరికట్టడంలో కొన్ని దేశాలు పురోగతి సాధించొచ్చు.. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇది చాలా కాలం ఉంటుంది. అందుకు మనం సిద్ధం కావాల్సిందే. ఈ వైరస్‌తో రానున్న రోజుల్లో సహజీవనం చేయాల్సిందే. అది ఎలా చేయాలన్న ప్రశ్నకు అన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు సమాధానాలు వెతుక్కోవాలి’’ అని టెడ్రోస్‌ తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.