close

ప్రధానాంశాలు

Published : 03/12/2020 05:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాష్ట్రాలపై రుణభారం

జీఎస్‌డీపీ-రుణ నిష్పత్తి 36%
 క్రిసిల్‌ రేటింగ్‌ సంస్థ అంచనా

ఈనాడు, దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల రుణ భారం గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లు క్రిసిల్‌ రేటింగ్‌ సంస్థ అంచనా వేసింది. మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌, దాని వెన్నంటి వచ్చిన ఆర్థిక మాంద్యం రాష్ట్రాల రుణ భారాన్ని జీఎస్‌డీపీలో 36%కి తీసుకెళ్లనున్నట్లు పేర్కొంది. గత దశాబ్ద కాలంలో ఇదే గరిష్ఠమని తెలిపింది. ఒకవైపు పన్ను ఆదాయం పడిపోవడం, మరోవైపు ఖర్చులు పెరిగిపోవడంతో అవసరాలు తీర్చుకోవడానికి రాష్ట్రాలు అప్పులపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొందని అభిప్రాయపడింది. దేశానికి 90% జీఎస్‌డీపీ సమకూర్చే 18 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి క్రిసిల్‌ ఈ అభిప్రాయానికొచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు కూడా ఉన్నాయి. ‘‘గతేడాదితో పోలిస్తే ఈ సారి రాష్ట్రాల ఆదాయం కనీసం 15% పడిపోయే అవకాశం ఉంది. రాష్ట్రాల ఆదాయంలో 50% జీఎస్‌టీ వసూళ్లు, జీఎస్‌టీ పరిహార చెల్లింపులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్ను వాటాలదే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒడుదొడుకులకు లోనవడం వల్ల ఇందులో భారీగా కోతపడే ప్రమాదముంది. ప్రస్తుత పరిస్థితులను బట్టిచూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు తీసుకొనే మొత్తం రుణాల పరిమాణం రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రకారం.. ఆర్థిక సంవత్సరాంతానికి రాష్ట్రాలు తీసుకున్న మొత్తం అప్పుల పరిమాణం రూ.68 లక్షల కోట్లకు చేరుతుంది. ఇది రాష్ట్రాల జీఎస్‌డీపీలో 36%కి సమానం.’’ అని క్రిసిల్‌ పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన