
ప్రధానాంశాలు
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ అరెస్టు
ఈనాడు డిజిటల్, చెన్నై: న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌ను కేంద్ర నేర విభాగానికి చెందిన పోలీసులు బుధవారం చెన్నైలో అరెస్టు చేశారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన కర్ణన్ కొద్ది రోజుల క్రితం హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గురించి, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇది వివాదాలకు కారణంగా మారింది. ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టుకు చెందిన కొందరు న్యాయవాదులు... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అనంతరం ఈ విషయంపై కర్ణన్‌ను విచారించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు సార్లు పోలీసుల ఎదుట కర్ణన్ హాజరుకాగా, ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. కర్ణన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని రాష్ట్ర పోలీసులను హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు చెన్నై కమిషనర్, డీజీపీలను నేరుగా హాజరుకావాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ కర్ణన్‌ను బుధవారం కేంద్ర నేర విభాగానికి చెందిన పోలీసులు అరెస్టు చేశారు.
ప్రధానాంశాలు
సినిమా
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది: పంత్
- కేదార్‌ను ధోనీ కొనసాగించేవాడు..కానీ: గంభీర్
- సుప్రీం తీర్పు: ఎస్ఈసీకి ఏపీ ప్రభుత్వ సహకారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
