బిహార్‌లో నీటిపైనే అంత్యక్రియలు
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 08:02 IST

బిహార్‌లో నీటిపైనే అంత్యక్రియలు

భీకర వర్షాలు బిహార్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. దర్భంగా జిల్లాలో కమలా, కోసి, బాగమతి, అధ్వారా నదులు ఉప్పొంగుతుండగా.. ఆ జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల ప్రభావంతో.. అనేక గ్రామాలు జలమయమయ్యాయి. శ్మశానవాటికల్లో సైతం నీరు చేరింది. ఈ క్రమంలో మహిసౌత్‌ గ్రామంలో 90 ఏళ్ల సినోయ్‌ యాదవ్‌ సోమవారం మృతి చెందాడు. అతడి అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతుడి బంధువులు నానా ఇక్కట్లు పడ్డారు. నీళ్లతో నిండిపోయిన శ్మశానవాటికలోనే.. వెదురు కర్రలతో వేదిక నిర్మించి, దానిపై ఓ సిమెంటు తొట్టె ఏర్పాటు చేశారు. అందులో కర్రలు నింపి మృతదేహాన్ని దహనం చేశారు.  


కోట్లు అందినా.. కోటిన్నర లేక చిన్నారి మృతి

కేరళలోని కోజికోడ్‌ ప్రభుత్వాసుపత్రిలో స్పైనల్‌ మస్కులర్‌ ఆట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న ఆరు నెలల ఇమ్రాన్‌.. మంగళవారం కన్ను మూశాడు. మలప్పురం జిల్లా పెరింతలమన్నా పట్టణానికి చెందిన ఆరిఫ్‌కు కొన్ని నెలల క్రితం ఇమ్రాన్‌ జన్మించాడు. ఆ చిన్నారి.. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. స్పైనల్‌ మస్కులర్‌ ఆట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న ఇమ్రాన్‌కు చికిత్స అందించాలంటే రూ.కోట్లు వెచ్చించాలి.  జోల్‌గెన్జామా ఓనాసెమ్నోజినీ అనే ఇంజెక్షన్‌ అవసరం. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఔషధాల్లో ఇదొకటి. విదేశాల్లో మాత్రమే లభించే ఈ ఇంజెక్షన్‌ ఒక్కో డోసు ధర రూ.18 కోట్లు. వైద్యానికి అయ్యే ఖర్చును భరించే స్తోమత లేని ఇమ్రాన్‌ తల్లిదండ్రులకు దాతలు అండగా నిలిచారు. అంతా కలిసి రూ.16.5 కోట్లు సమీకరించారు. మరో కోటిన్నర సమీకరించగలిగితే.. ఇమ్రాన్‌ చికిత్స విషయంలో అంతా అనుకున్నట్టు జరిగేది. మరోవైపు, ప్రభుత్వమే ఇమ్రాన్‌కు ఉచిత చికిత్స అందించాలని కోరుతూ ఆరిఫ్‌ ఇటీవల కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు చిన్నారి ఆరోగ్య స్థితిని గమనించాలని ఐదుగురు సభ్యులతో కూడిన మెడికల్‌ బోర్డును ఆదేశించింది. ఉచిత చికిత్స అందించాలన్న ఆరిఫ్‌ విజ్ఞప్తిపై మాత్రం సానుకూల స్పందన రాలేదు. ఆరోగ్య శాఖ, కేరళ సోషల్‌ సెక్యూరిటీ మిషన్‌ (కేఎస్‌ఎస్‌ఎం)లు చిన్నారికి ఆర్థిక సాయం అందించే స్థితిలో లేవని ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. దీంతో వెంటిలేటర్‌ మీద ఉన్న ఇమ్రాన్‌.. సమయానికి చికిత్స పొందలేక తుదిశ్వాస విడిచాడు.  


సెల్‌ఫోన్ల వెలుతురులోనే రోగికి చికిత్స

మధ్యప్రదేశ్‌లో ఛతర్‌పుర్‌ జిల్లాలో నౌగావ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో.. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఓ రోగికి వైద్యులు మొబైల్‌ ఫ్లాష్‌లైట్ల వెలుతురులో చికిత్స నిర్వహించాల్సి వచ్చింది. అలిపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే శివ్‌ శంకర్‌(45), పార్వతి(40)లు.. పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని గ్రామస్థులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శివ శంకర్‌ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. విషమంగా ఉన్న పార్వతి పరిస్థితిని చూసి వెంటనే చికిత్స ప్రారంభించారు. సరిగ్గా అదే సమయంలో ఆసుపత్రిలో విద్యుత్తు పోయింది. కనీసం జనరేటర్‌ సైతం అందుబాటులో లేదు. రోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు చికిత్స ఆపకూడదని నిర్ణయించుకున్నారు. వెంటనే వైద్య సిబ్బంది తమ మొబైల్‌ ఫోన్‌ ఫ్లాష్‌ లైట్లను ఆన్‌చేసి చూపించగా చికిత్స అందించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన