నిర్దిష్ట ఆరోపణల్లేకుండా సమన్లు జారీచేయొద్దు

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:49 IST

నిర్దిష్ట ఆరోపణల్లేకుండా సమన్లు జారీచేయొద్దు

స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: నిందితులకు సమన్లు జారీ చేసే విషయంలో మెజిస్ట్రేట్లు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. నిర్దిష్ట ఆరోపణలుంటేనే.. వాటిపై పూర్తి సంతృప్తి చెందితేనే ఈ ప్రక్రియను చేపట్టాలని పేర్కొంది.‘‘సమన్లు జారీ.. తీవ్రమైన విషయం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పాత్రపై నిర్దిష్ట సాక్ష్యాలుంటేనే చర్యలు తీసుకోవాలి. ఆధారాల్లేని ప్రకటనలను అనుసరించి ఈ ప్రక్రియను చేపట్టకూడదు’’ అని ఓ పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న వ్యాఖ్యానించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన