close

ప్రధానాంశాలు

Published : 12/04/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధోనీపై ద్రవిడ్‌ ఆగ్రహించిన వేళ..

దిల్లీ: ‘‘ఇందిరానగర్‌ గూండాను నేను’’ అంటూ భారత క్రికెట్‌ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ కోపంతో ఊగిపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే అతను.. ఓ వ్యాపార ప్రకటన కోసం అలా నటించాల్సి వచ్చింది. అయితే క్రికెట్‌ ఆడే రోజుల్లో ద్రవిడ్‌ కోపాన్ని తాను చూశానని మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ వెల్లడించాడు. 2006లో పాకిస్థాన్‌లో వన్డే మ్యాచ్‌ సందర్భంగా ధోనీపై అతను అరిచాడని తెలిపాడు.  ‘‘ద్రవిడ్‌ కోపాన్ని చూశా. అప్పుడే కొత్తగా జట్టులోకి వచ్చిన ధోని పాకిస్థాన్‌ పర్యటనలో ఓ మ్యాచ్‌లో పేలవ షాట్‌ ఆడి క్యాచ్‌ ఔటయ్యాడు. అప్పుడు ధోనీపై ద్రవిడ్‌కు తీవ్రమైన కోపం వచ్చింది. ‘నువ్వు ఇలాగేనా ఆడేది? నువ్వు మ్యాచ్‌ ముగించాల్సింది’ అని కోపంతో మహీపై ఉగిపోయాడు. ఆంగ్లంలో అరిచేశాడు. అతని మాటల్లో సగం నాకు అర్థమే కాలేదు. దీంతో తర్వాతి మ్యాచ్‌లో ధోని భారీ షాట్లు ఆడలేదు. ఏమైందని అడిగితే.. ‘ద్రవిడ్‌తో మళ్లీ తిట్టించుకోవాలనుకోవట్లేదు. నెమ్మదిగా ఆడి మ్యాచ్‌ ముగించి వెళ్తాను’ అని అప్పుడు చెప్పాడు’’ అని సెహ్వాగ్‌ తాజాగా బయటపెట్టాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన