అమ్మా.. ఇదిగో పతకం

ప్రధానాంశాలు

Published : 28/07/2021 02:59 IST

అమ్మా.. ఇదిగో పతకం

చాను భావోద్వేగం

ఇంఫాల్‌: ఒలింపిక్‌ రజత పతక విజేత మీరాబాయి చాను భావోద్వేగానికి లోనయింది. విశ్వ వేదికపై పతకంతో మెరిసిన చాను (49కేజీ) అమ్మా, నాన్నను చూడగానే ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. ఆమె మంగళవారం ఇంఫాల్‌ విమానాశ్రయంలో దిగింది. అక్కడ తల్లి సైఖోమ్‌ ఆంగ్‌బి తోంబి లీమా, తండ్రి సైఖోమ్‌   క్రితి మీతీలను హత్తుకోగానే చాను కళ్లలో నీళ్లు తిరిగాయి. అనంతరం ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో చాను పాల్గొంది. సీఏం ఆమెకు కోటి రూపాయల చెక్‌తో పాటు ఏఎస్పీగా నియామక పత్రాన్ని అందించారు.

లాక్‌డౌన్‌ తర్వాత ఫిట్‌నెస్‌ సమస్యలు: నిరుడు టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడటం.. లాక్‌డౌన్‌ విరామం వల్ల ఫిట్‌నెస్‌ సమస్యలు తలెత్తినట్లు మీరాబాయి చాను తెలిపింది. ‘‘లాక్‌డౌన్‌ తర్వాత సాధన మొదలుపెట్టినప్పుడు వెన్ను బిగుతుగా తయారైంది. కుడి భుజంలో సమస్య వచ్చింది. అవి గాయాలు కాకపోయినా ఎక్కువ బరువులు ఎత్తినప్పుడు కండరాలు బిగుతుగా మారిపోయేవి. లాక్‌డౌన్‌ సమయంలో సాధన ఆపేయడమే ఇందుకు కారణం. అమెరికాలో మాజీ వెయిట్‌ లిఫ్టర్‌, డాక్టర్‌ ఆరోన్‌ హార్షింగ్‌ నాకు చికిత్స అందించాడు. అనంతరం ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రికార్డు నెలకొల్పా’’ అని చాను పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన