ప్రజ్ఞేశ్‌ పరాజయం

ప్రధానాంశాలు

Published : 18/09/2021 03:39 IST

ప్రజ్ఞేశ్‌ పరాజయం

ఫిన్లాండ్‌తో డేవిస్‌కప్‌ పోరు

ఎస్పూ (ఫిన్లాండ్‌): ఫిన్లాండ్‌తో డేవిస్‌కప్‌ ప్రపంచ గ్రూప్‌ 1 పోరులో భారత్‌ 0-1తో వెనుకబడిపోయింది. తొలి మ్యాచ్‌లో ప్రజ్ఞేశ్‌ గునేశ్వరన్‌ తన కన్నా తక్కువ ర్యాంకు ఆటగాడి చేతిలో ఓడిపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 165వ స్థానంలో ఉన్న ప్రజ్ఞేశ్‌ శుక్రవారం 3-6, 6-7 (1)తో ప్రపంచ 419వ ర్యాంకు ఆటగాడు ఒట్టో విర్టానెన్‌ చేతిలో కంగుతిన్నాడు. అతడు ఆరో గేమ్‌లో సర్వీసు చేజార్చుకున్నాడు. తర్వాతి గేమ్‌లో బ్రేక్‌ సాధించే అవకాశం వచ్చినా.. ప్రజ్ఞేశ్‌ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్‌.. ఫిన్లాండ్‌ నంబర్‌వన్‌ ఎనిల్‌ రుసువోరితో తలపడతాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన