ఆశలు నిలిపిన డేవిడ్‌

ప్రధానాంశాలు

Published : 21/10/2021 03:52 IST

ఆశలు నిలిపిన డేవిడ్‌

నెదర్లాండ్స్‌పై నమీబియా విజయం

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 12 దశకు అర్హత సాధించాలనే నమీబియా ఆశలను ఆ జట్టు ఆటగాడు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ డేవిడ్‌ వీస్‌ (66 నాటౌట్‌; 40 బంతుల్లో 4×4, 5×6) సజీవంగా నిలిపాడు. బుధవారం అతను అజేయ అర్ధ శతకంతో చెలరేగడంతో గ్రూప్‌- ఎ మ్యాచ్‌లో ఆ జట్టు ఆరు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్‌ ప్యాట్రిక్స్‌ (70; 56 బంతుల్లో 6×4, 1×6) సత్తాచాటాడు. కొలిన్‌ (35), ఎడ్వర్డ్స్‌ (21 నాటౌట్‌) కూడా రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో నికోలస్‌ (2/36) మెరిశాడు. అనంతరం ఛేదనలో నమీబియా 4 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. 8.2 ఓవర్లలో 52/3తో ఆ జట్టు కష్టాల్లో ఉన్నపుడు క్రీజులో అడుగుపెట్టిన డేవిడ్‌ వస్తూనే చెలరేగాడు. అద్భుతమైన ఆటతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. సిక్సర్లతో వీరవిహారం చేసి లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చాడు. కెప్టెన్‌ ఎరాస్మస్‌ (32)తో కలిసి నాలుగో వికెట్‌కు 93 పరుగులు జతచేసిన డేవిడ్‌.. చివరి వరకూ క్రీజులో నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిన నమీబియా ఈ విజయంతో రేసులో నిలిచింది. తన చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిస్తే ఆ జట్టు ముందంజ వేసే అవకాశం ఉంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన