ఇది స్పిన్నర్ల ప్రపంచకప్‌: రషీద్‌

ప్రధానాంశాలు

Published : 21/10/2021 03:52 IST

ఇది స్పిన్నర్ల ప్రపంచకప్‌: రషీద్‌

దుబాయ్‌: ఈ టీ20 ప్రపంచకప్‌లో స్పిన్నర్ల హవా సాగుతుందని అఫ్గానిస్థాన్‌ లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ అన్నాడు. తాము మెరుగ్గా బ్యాటింగ్‌ చేస్తే ఏ జట్టునైనా ఓడించగలమని చెప్పాడు. యూఏఈలో పిచ్‌లపై స్పిన్నర్లెప్పుడూ ప్రభావవంతంగా బౌలింగ్‌ చేస్తారని అన్నాడు. ‘‘ఇక్కడ పరిస్థితులు ఎల్లప్పుడూ స్పిన్నర్లకు సహకరిస్తాయి. ఇది స్పిన్నర్ల ప్రపంచకప్‌ అవుతుంది. ఇక్కడ పిచ్‌లు ఎలా తయారు చేసినా సరే.. స్పిన్‌కే సహకరిస్తాయి. ప్రపంచకప్‌లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఐపీఎల్‌లో ఎన్నో సార్లు వాళ్లు తమ జట్లను పోటీలోకి తేవడం చూశాం. ప్రపంచకప్‌లోనూ అదే జరుగుతుందని భావిస్తున్నా’’ అని రషీద్‌ ఖాన్‌ చెప్పాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన