wuhan: అమెరికా చేతిలో వుహాన్‌ రహస్యాలు?
close

ప్రధానాంశాలు

Updated : 21/06/2021 11:40 IST

wuhan: అమెరికా చేతిలో వుహాన్‌ రహస్యాలు?

 కరోనా మూలాలపై ఆధారాలు
 వాషింగ్టన్‌కు పరారైన   చైనా కీలక ఉన్నతాధికారి

దిల్లీ: చైనా ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారి ఒకరు ప్లేటు ఫిరాయించి, అమెరికా పంచన చేరినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. వుహాన్‌లోని వివాదాస్పద వైరాలజీ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీకైందనడానికి ఆధారాలనూ జో బైడెన్‌ సర్కారుకు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఈ మహమ్మారి మూలాలపై అమెరికా కొత్తగా దృష్టి పెట్టి, విచారణకు ఆదేశించినట్లు సమాచారం. సదరు అధికారికి చైనాలోని గూఢచర్య విభాగాలు, భద్రత వ్యవస్థలతో గట్టి సంబంధం ఉంది. ఆయన ప్లేటు ఫిరాయించిన మాట నిజమే అయితే చైనా గూఢచారి విభాగానికి, రహస్య కార్యకలాపాలకు ఎదురు దెబ్బ తగిలినట్లే. ఆ ఉన్నతస్థాయి వ్యక్తి పేరు డాంగ్‌ జింగ్‌వెయ్‌. చైనా మినిస్ట్రీ ఆఫ్‌ స్టేట్‌ సెక్రటరీ విభాగంలో వైస్‌ మినిస్టర్‌గా పనిచేస్తున్నారు. నిజానికి ఇది ‘గువాన్‌బు’ అనే గూఢచర్య సంస్థ. శత్రు గూఢచర్య కార్యకలాపాలను తిప్పికొట్టడానికి ఉద్దేశించిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేషన్లకు ఆయన 2018 ఏప్రిల్‌ నుంచి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన కొంతకాలంగా కనిపించడం లేదని చైనా సామాజిక మాధ్యమాల్లో జోరుగా వార్తలొచ్చాయి. ఆ తర్వాత.. ఆయన అమెరికాకు పరారైనట్లు ప్రచారం మొదలైంది. అమెరికాకు వలస వెళ్లిన చైనా విదేశాంగ శాఖ మాజీ అధికారి, ప్రజాస్వామ్య అనుకూలవాది హన్‌ లియాంచావో ఈ నెల 16న చేసిన ట్వీట్‌తో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. చైనాలో తియానన్మెన్‌ స్క్వేర్‌ ఊచకోత తర్వాత హన్‌.. అమెరికాకు పారిపోయారు. కాగా డాంగ్‌ అదృశ్యంపై డ్రాగన్‌ కూడా ఆందోళన చెందుతోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడంలేదు. 

అప్పగించాలన్న చైనా..

తన కుమార్తె డాంగ్‌ యాంగ్‌తో కలిసి హాంకాంగ్‌ మీదుగా ఫిబ్రవరిలో డాంగ్‌ అమెరికాకు చేరుకొన్నట్లు హన్‌ పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం.. మార్చిలో అలాస్కాలో జరిగిన అమెరికా-చైనా సమావేశంలో డాంగ్‌ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆయనను అప్పగించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్‌, జాతీయ భద్రత సలహాదారు జాక్‌ సలైవాన్‌ను చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ కోరారు. ఈ అభ్యర్థనను అమెరికా తోసిపుచ్చింది. అమెరికాలో గూఢచర్యం, విదేశాంగ విధానాలపై కథనాలు రాసే ‘స్పై టాక్‌ న్యూస్‌ లెటర్‌’ కూడా డాంగ్‌ ఫిరాయించి ఉండొచ్చని పేర్కొంది. అది నిజమైతే చైనా చరిత్రలోనే అతిపెద్ద ‘వెన్నుపోటు’ అవుతుందని వ్యాఖ్యానించింది. మరికొన్ని అమెరికా పత్రికలు కూడా డాంగ్‌ చైనా నుంచి పారిపోయినట్లు కథనాలను ప్రచురించాయి. ప్రస్తుతం ఆయన ‘అమెరికా డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ’ (డీఐఏ) అదుపులో ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వుహాన్‌ ల్యాబ్‌లో జీవాయుధ పరిశోధనల ఆనవాళ్లను చైనా సర్కారు చెరిపేస్తున్నట్లు పేర్కొన్నాయి. 

గుప్పిట్లో కీలక సమాచారం

డ్రాగన్‌ ప్రత్యేక ఆయుధ వ్యవస్థలు, వుహాన్‌ ల్యాబ్‌లో చైనా సైన్యం కార్యకలాపాలు, కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ మూలాలు, అమెరికాలో ఉన్న చైనా వేగుల వివరాలు తదితరాలపై డాంగ్‌కు పూర్తి సమాచారం ఉంది. వీటికి సంబంధించి ‘టెరాబైట్ల కొద్దీ డేటా’ను ఆయన డీఐఏకు అందించినట్లు ‘రెడ్‌స్టేట్‌’ పత్రిక పేర్కొంది.

స్వదేశంలోనే ఉన్నారా..

డాంగ్‌ అంశంపై చైనా అధికారికంగా స్పందించలేదు. కానీ జూన్‌ 18న డాంగ్‌ ఒక కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సదస్సులో పాల్గొన్నట్లు అధికార కమ్యూనిస్టు పార్టీ మద్దతున్న వార్తా వెబ్‌సైట్‌ ఒకటి పేర్కొంది. విదేశీ శక్తుల తరఫున పనిచేస్తున్న నమ్మకద్రోహుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్టు డాంగ్‌ పేర్కొన్నట్లు తెలిపింది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన