నేడు మోదీతో మమత భేటీ

ప్రధానాంశాలు

Updated : 27/07/2021 14:03 IST

నేడు మోదీతో మమత భేటీ

కాంగ్రెస్‌ నేతలతోనూ సమావేశం

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఐదు రోజుల హస్తిన పర్యటన నిమిత్తం సోమవారం దిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్‌ విజయం సాధించిన తర్వాత, మంగళవారం ఆమె తొలిసారి ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ ఉండనుంది. మరోవైపు... సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కమల్‌నాథ్‌, ఆనంద్‌ శర్మ, అభిషేక్‌ మను సింఘ్విలతోనూ దీదీ సమావేశం కానున్నారు. బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీలతో భేటీ అవుతారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను బలంగా ఢీకొట్టాలన్నది మమత వ్యూహంగా చెబుతున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున విపక్ష నేతలంతా దిల్లీలోనే ఉన్నారు. ఈ అంశంపై వారితో చర్చించేందుకు వీలుగా తృణమూల్‌ అధ్యక్షురాలు దిల్లీలో పర్యటిస్తున్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన