దిల్లీలో అన్నదాతల భారీ ర్యాలీ

ప్రధానాంశాలు

Published : 18/09/2021 05:01 IST

దిల్లీలో అన్నదాతల భారీ ర్యాలీ

శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడి అరెస్టు

దిల్లీ: కొత్త సాగు చట్టాలకు నిరసనగా దిల్లీలో రైతులతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించిన శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రంలోని ఎన్‌డీయే ప్రభుత్వం నుంచి గత ఏడాది వైదొలగిన శిరోమణి అకాలీదళ్‌..సెప్టెంబరు 17ను నిరసన దినంగా పాటిస్తోంది. వివాదాస్పదమైన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. దీనిలో భాగంగానే దిల్లీలో శుక్రవారం భారీ ప్రదర్శనను నిర్వహించింది. ఈ కార్యక్రమం గురుద్వారా రకబ్‌ గంజ్‌ నుంచి పార్లమెంటు హౌస్‌ వరకూ కొనసాగింది. కొవిడ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ సుఖ్‌బీర్‌ సింగ్‌, హర్‌సిమ్రత్‌ కౌర్‌ సహా 15 మందిని పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. రైతుల నిరసన కార్యక్రమం వల్ల దేశ రాజధానిలోని పలు మార్గాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన