186 రోజుల కనిష్ఠానికి క్రియాశీలక కేసులు

ప్రధానాంశాలు

Published : 23/09/2021 05:28 IST

186 రోజుల కనిష్ఠానికి క్రియాశీలక కేసులు

దిల్లీ: దేశంలో కొవిడ్‌ క్రియాశీలక కేసులు క్రమేపీ తగ్గుతుండటం ఊరటనిస్తోంది. వీటి సంఖ్య బుధవారం మరింత తగ్గి 186 రోజుల కనిష్ఠానికి చేరింది. గత 24 గంటల్లో 26,964 కొత్త కేసులు బయటపడగా.. 383 మంది కొవిడ్‌తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,35,31,498కి చేరగా.. 4,45,768 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 34,167 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. కొత్త కేసులు ఇంతకంటే తక్కువ ఉండటంతో క్రియాశీల కేసుల సంఖ్య 3,01,989 (0.90%)కి తగ్గింది. ఇంతవరకు మొత్తం 3,27,83,741 మంది కొవిడ్‌ను జయించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన