గుజరాత్‌లో హెరాయిన్‌ జప్తు ఘటనపై.. సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తునకు కాంగ్రెస్‌ డిమాండు!

ప్రధానాంశాలు

Published : 27/09/2021 04:25 IST

గుజరాత్‌లో హెరాయిన్‌ జప్తు ఘటనపై.. సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తునకు కాంగ్రెస్‌ డిమాండు!

దేశవ్యాప్తంగా విలేకరుల సమావేశాలు

దిల్లీ: గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవులో గతవారం దాదాపు మూడు వేల కిలోల హెరాయిన్‌ బయటపడ్డ ఘటనపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు కాంగ్రెస్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ వ్యవహారంపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆ పార్టీ విలేకర్ల సమావేశాలు నిర్వహించనుంది. భారీమొత్తంలో హెరాయిన్‌ స్వాధీనంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేయనుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సచిన్‌ పైలట్‌ ముంబయిలో, అశ్వనీ కుమార్‌ కోల్‌కతాలో, ముకుల్‌ వాస్నిక్‌ గువాహటిలో, రాజీవ్‌ శుక్లా రాయ్‌పుర్‌లో, దీపేందర్‌ హుడా లఖ్‌నవూలో, మోహన్‌ ప్రకాశ్‌ పట్నాలో, సల్మాన్‌ ఖుర్షీద్‌ రాంచీలో, శక్తిసిన్హ్‌ గోహిల్‌ భోపాల్‌లో ఈ వారం విలేకర్ల సమావేశాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. అదానీ సంస్థ నిర్వహణలోని ఈ ఓడరేవులో అధికారులు జప్తు చేసిన హెరాయిన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.21 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన