మరోసారి పెరిగిన డీజిల్‌ ధర

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:49 IST

మరోసారి పెరిగిన డీజిల్‌ ధర

దిల్లీ: డీజిల్‌ ధర వరసగా రెండోరోజు కూడా పెరిగింది. సోమవారం లీటరుకు 25 పైసలు చొప్పున ధర పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. వారంలో ఇది మూడోసారి. తాజా పెంపుతో 4 రోజుల్లోనే డీజిల్‌పై 70 పైసలు చొప్పున పెరిగినట్లయింది. దిల్లీలో డీజిల్‌ లీటరు రూ.89.32కి, ముంబయిలో రూ.96.94కి చేరింది. ఈ నెల 24 నుంచి చమురు సంస్థలు మళ్లీ రోజువారీగా ధరను సవరిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధ]రలు మూడేళ్ల గరిష్ఠానికి చేరుకోవడంతో దేశీయంగానూ పెట్రోలు, డీజిల్‌పై భారం మరింత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన