జలాంతర్గాముల రహస్య సమాచారం లీక్‌

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:50 IST

జలాంతర్గాముల రహస్య సమాచారం లీక్‌

నేవీ అధికారి, ఇద్దరు మాజీ ఉద్యోగులు సహా ఐదుగురి అరెస్ట్‌!

దిల్లీ: జలాంతర్గాముల సమాచారాన్ని లీక్‌ చేసినందుకు నౌకాదళానికి చెందిన ఒక అధికారి, ఇద్దరు విశ్రాంత ఉద్యోగులను సీబీఐ అరెస్టు చేసింది. మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులనూ అదుపులోకి తీసుకుంది. వీరు నేవీలోని ‘కిలో’ తరగతి సబ్‌మెరైన్ల ఆధునికీకరణకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నిందితుల్లో కమాండర్‌ స్థాయి అధికారి ఉన్నట్లు తెలిపాయి. అరెస్టయినవారితో సంబంధాలున్న నేవీ ఉద్యోగులను సీబీఐ ప్రశ్నిస్తోందని చెప్పాయి. ఈ వ్యవహారంలో మరిన్ని అరెస్టులు ఉండొచ్చని పేర్కొన్నాయి. విచారణకు నౌకాదళం నుంచి పూర్తి సహకారం ఉందని తెలిపాయి.
గత నెలలో రహస్యంగా ఒక ఆపరేషన్‌ నిర్వహించిన సీబీఐ.. నిందితుల గుట్టురట్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి సహా దేశంలోని 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ముఖ్యమైన పత్రాలు, డిజిటల్‌ ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న కమాండర్‌ స్థాయి అధికారి.. కిలో తరగతి జలాంతర్గాముల ఆధునికీకరణకు సంబంధించిన కీలక వివరాలను మాజీ ఉద్యోగులకు లీక్‌ చేశాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు బదులుగా ఆయన అనుచిత ప్రయోజనాలను పొందారని వివరించాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన