close

తాజా వార్తలు

వచ్చే ఏడాది నుంచి మారుతీ డీజిల్‌ కార్లు బంద్‌!

తయారీ ఖర్చే కారణం 
మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ వెల్లడి


దిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ వచ్చే ఏడాది నుంచి డీజిల్‌ వేరియంట్‌లో కార్ల ఉత్పత్తిని నిలిపివేయనుంది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి తమ అన్ని మోడళ్లలో డీజిల్‌ కార్లను అమ్మబోమని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ గురువారం వెల్లడించారు. ప్రస్తుతం దేశీయంగా ఈ సంస్థ అమ్మకాలు జరుపుతున్న కార్లలో దాదాపు 23 శాతం డీజిల్‌ కార్లే ఉండడం విశేషం. 
వినియోగదారుల కోసమే..
డీజిల్‌ కార్ల తయారీకి ఎక్కువ ఖర్చు అవుతున్న దృష్ట్యా దీన్ని వినియోగదారులు భరించగలిగే వరకూ ఈ తరహా కార్ల ఉత్పత్తి చేస్తామని గతంలో మారుతీ ప్రకటించింది. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 తరహా వాహనాలు అరంగేట్రం చేయనున్నాయి. ఈ సాంకేతికతతో డీజిల్‌ వేరియంట్‌లో కార్ల ఉత్పత్తి ఖర్చు బాగా పెరగనుందని భార్గవ వెల్లడించారు. బీఎస్‌-6, డీజిల్‌ వేరియంట్‌లో చిన్న కార్ల ధరలు అత్యధికంగా పెరిగే అవకాశం ఉండడంతో దీన్ని వినియోగదారులు భరించే అవకాశం ఉండనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డీజిల్‌ వేరియంట్‌ ధరలు పెరిగితే ఏ కార్ల తయారీ సంస్థా డీజిల్‌ ఇంజిన్‌ కార్లను తయారు చేసే సాహసం చేయబోదని భార్గవ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎస్‌-క్రాస్‌, సియాజ్‌, వితారా బ్రెజ్జా, డిజైర్‌, బాలెనో, స్విఫ్ట్‌ మోడళ్లు డీజిల్‌ వేరియంట్‌లోనూ లభిస్తున్నాయి. అయితే బాగా ఖరీదైన కార్ల విషయంలో డీజిల్‌ వేరియంట్‌ను కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.