close

తాజా వార్తలు

తేడా ఉందే.. మేము చూస్తాములే..!

  జెట్‌ ఎయిర్‌వేస్‌పై స్వతంత్ర ఆడిట్‌కు ఈడీ మొగ్గు

న్యూదిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేష్‌ గోయల్‌ మరిన్ని చిక్కుల్లో కూరుకుపోనున్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ లెక్కల పుస్తకాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్వంతంత్ర ఆడిట్‌ చేయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సంస్థలో నిధుల మళ్లింపుపై ఈడీ దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. 
గత వారం నరేష్‌ గోయల్‌ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. అప్పుడు తెలిసిన విషయాలకు గతంలో ఎస్‌బీఐ నిర్వహించిన ఆడిట్‌లోని విషయాలకు మధ్య అంతరం ఉండటాన్ని గుర్తించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు స్వంత్ర ఆడిట్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. 
గత నెలల గోయల్‌ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో ఆయన ఇల్లు, జెట్‌ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలను సోదా చేసింది.  ఆ తర్వాత విదేశీ మారకద్రవ్య చట్టం ఉల్లంఘనలపై గత వారం గోయల్‌ను ప్రశ్నించింది. ఆయన పేరుతో 19 కంపెనీలు రిజిస్టరై ఉన్నట్లు గుర్తించింది. వీటిల్లో ఐదు విదేశాల్లో నమోదై ఉన్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.