Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 109924
            [news_title_telugu_html] => 

గృహమే కదా స్వచ్ఛసీమ

[news_title_telugu] => గృహమే కదా స్వచ్ఛసీమ [news_title_english] => [news_short_description] => ఇంటి చుట్టూ ఐదు కిలోమీటర్ల దూరంలో ఎక్కడ కొబ్బరి చిప్పలున్నా.. విరిగిన ఇటుకలున్నా.. నరికిన చెట్లున్నా.. పగిలిన అద్దాలున్నా.. వదిలిన వ్యర్థాలున్నా.. అన్నీ ఇంటికి వచ్చేస్తాయి. గోడలుగా, పైకప్పుగా ప్రాణం పోసుకుంటాయి. ఇంటిని నిలబెడతాయి. బంకమట్టితో కలిసిపోయి.. [news_tags_keywords] => House with Wast, New Construction, Varevva [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-10 02:32:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
గృహమే కదా స్వచ్ఛసీమ - EENADU
close

తాజా వార్తలు

గృహమే కదా స్వచ్ఛసీమ

వ్యర్థాలతో ఇల్లు కట్టి చూడు...
ఇల్లు కట్టి చూడు..
ముందంతా.. సిమెంట్‌ దుమ్ము
వెనకంతా.. ఇనుప చువ్వలు..
పక్కలన్నీ మార్బుల్‌ ముక్కలు, ప్లాస్టిక్‌ సంచులు..
కానీ, ఈయన ఇల్లు కడితే...
ఆ ఇంటి పరిసరాల్లోని చెత్తంతా మాయమైపోతుంది.
ఇంటి చుట్టూ ఐదు కిలోమీటర్ల దూరంలో ఎక్కడ కొబ్బరి చిప్పలున్నా.. విరిగిన ఇటుకలున్నా.. నరికిన చెట్లున్నా.. పగిలిన అద్దాలున్నా.. వదిలిన వ్యర్థాలున్నా.. అన్నీ ఇంటికి వచ్చేస్తాయి. గోడలుగా, పైకప్పుగా ప్రాణం పోసుకుంటాయి. ఇంటిని నిలబెడతాయి. బంకమట్టితో కలిసిపోయి.. పర్యావరణహితం కోరుతాయి. ఇలాంటి ఇళ్ల సృష్టికర్త విను డేనియల్‌. కేరళకు చెందిన యువ ఆర్కిటెక్ట్‌ గురించి ఇటీవలే కిరణ్‌ మజుందార్‌ షా ట్విటర్‌లో పేర్కొనడంతో ఒక్కసారిగా అతడు వెలుగులోకి వచ్చాడు. ఆ కథేంటో చదివేయండి..

సూర్య కిరణాలు నా ఇంట్లోకి రావాలి. కానీ వేడి ఉండకూడదు ఇంట్లో వాన కురవాలి. కానీ, నీటి చెమ్మ వెతికినా కనిపించొద్దు అన్నిరకాల వసతులూ ఉండాలి. నిర్వహణ ఖర్చు ఉండొద్దు.. కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్న ఓ క్లయింట్‌ (రామానుజన్‌) పెట్టిన షరతులు..
ఇంటి పైభాగాన్ని విడదీసి.. సరికొత్త నమూనాతో వెలుతురు అంతటా ప్రసరించేలా చేశాడు విను డేనియల్‌. వాన కురిసినా.. చెమ్మ లేకుండా నిర్మించాడు. అలాగని అంగుళాల మందంతో కాంక్రిట్‌ వేయలేదు.. పర్యావరణహితమైన బంకమట్టితో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. పనికిరాని వస్తువులతో రామానుజన్‌ కలల సౌధాన్ని.. కళాత్మకం చేశాడు. ఇల్లు చూశాక యజమాని ముఖంపై చిరునవ్వు. అందులో వెలకట్టలేని సంతృప్తి.
బ్లూప్రింట్లు, కాంక్రీటు, ఇనుప చువ్వలు.. ఇల్లంటే మరెన్నో ఉండాలి. డేనియల్‌ నిర్మించే ఇళ్లకు కొబ్బరి చిప్పలు, పనికిరాని కర్రలు, విరిగిపోయిన వస్తువులు ఉంటే చాలు. చకచకా గోడలు లేస్తాయి. టకటకా పైకప్పు పడుతుంది. బంకమట్టితో నిర్మించే ఈ నెలవుల్లో వేసవిలో చల్లగా, చలిలో వెచ్చగా.. ఉంటుంది. ఇలాంటి ఇళ్లు నిర్మిస్తానని, పర్యావరణానికి తనవంతుగా ఏదో చేస్తానని.. డేనియల్‌ కలగన్నది కూడా లేదు. అమ్మనాన్నల దగ్గర అబుదాబిలో పెరిగాడు. బిడ్డను డాక్టర్‌ చేయాలని వాళ్లనుకున్నారు. మంచి సంగీత కళాకారుడు కావాలని ఇతగాడు కోరుకున్నాడు. ఇప్పుడు కళాత్మకమైన రీతిలో ఇళ్లు కడుతూ.. రోజురోజుకూ కలుషితమైపోతున్న పర్యావరణానికి చికిత్స చేస్తూ.. గొప్ప ఇంజినీర్‌గా కీర్తి సంపాదించాడు.

* ఆయన స్ఫూర్తితో..
ఇంజినీరింగ్‌, డిగ్రీ ఎంట్రెన్స్‌ కోసం కేరళ రాజధాని తిరువనంతపురం వచ్చిన డేనియల్‌.. పరీక్షలైతే రాశాడు గానీ, మనసంతా సంగీతంపైనే! ఆ ఫలితాలు విడుదల కాకముందే.. ఓమనకుట్టి దగ్గర సంగీత విద్యార్థిగా చేరాడు. ఇంతలో సీఈటీలో అర్కిటెక్చర్‌ కోర్సులో అడ్మిషన్‌ వచ్చింది. సంగీత సాధనలో కాలక్షేపంగా ఉంటుంది కదా అని.. అందులో చేరాడు. కచేరీలు, ఉత్సవాల్లో గళం వినిపించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ ప్రయాణంలో ఓ వ్యక్తి పరిచయం డేనియల్‌ జీవితాన్ని మార్చింది. ఆయనే లారీ బేకర్‌. ‘పర్యావరణహిత, చౌక, దీర్ఘకాలం మన్నే ఆర్కిటెక్చర్‌కు భారతపిత లాంటివారు ఆయన. పర్యావరణంపై ఆయనకున్న ప్రేమ నాలో మార్పు తీసుకొచ్చిందంటాడు డేనియల్‌. భూమిని కాపాడుకోవాలని తరచూ ఆయన చెప్పే మాటలు డేనియల్‌పై మంత్రంలా పనిచేశాయి. వ్యర్థాన్ని వదిలేయకుండా దానితో అద్భుతాలు చేయవచ్చని బోధించేవారు. చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలోని దొరికే వ్యర్థాలు, పనికిరాని వస్తువులతోనే ఇళ్లు నిర్మించాలని చెబుతూ ఉండేవారు. ఆయన స్ఫూర్తితో మట్టి ఇటుకలు, రీసైకిల్‌ చేసిన వస్తువులను కలగలిపి పర్యావరణహిత నిర్మాణ పద్ధతుల్లో గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.

 

రెండింటికి పేటెంట్లు 

డెబ్రిస్‌ వాల్‌ (శిథిలాలతో తయారు చేసిన గోడ), షట్టర్డ్‌ డెబ్రిస్‌ వాల్‌ అనే రెండు ప్రాజెక్టులకు పేటెంట్లను పొందాను. తక్కువ వ్యయంతో పర్యావరణ ఇంటిని నిర్మించినందుకు గాను ‘సేవ్‌ పెరియార్‌’ పొల్యూషన్‌ కంట్రోల్‌ కమిటీ నుంచి అవార్డు అందుకోవడం సంతృప్తినిచ్చింది. ప్రముఖ గాయకుడు కేజే యేసుదాస్‌ స్పాన్సర్‌ చేసిన ఆ ఇల్లు ఒక కేన్సర్‌ పేషెంట్‌ కోసం నిర్మించాం. మట్టన్‌చెర్రీలో శిథిలావస్థకు చేరిన సెయింట్‌జార్జ్‌ ఆర్థోడాక్స్‌ చర్చ్‌ను మా పద్ధతిలో పునర్నిర్మించాం. దీనికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. పథనంతిట్టాలో నిర్మించిన ఇంటికి పలు అవార్డులు వచ్చాయి.

* గోడల నుంచి భవనాల దాకా..
వ్యర్థాలను సమర్థంగా ఉపయోగిస్తూ, సహజ వనరులను సరిగ్గా వినియోగిస్తూ.. సరికొత్త నమూనాలు రూపొందించాడు ఈ యువ ఇంజినీర్‌. 2005లో బీఆర్క్‌ పూర్తయ్యాక ఆరోవిల్లే ఎర్త్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సస్టెయినబుల్‌ ఆర్కిటెక్చర్‌తో కలిసి సునామీ అనంతర కట్టడాల కోసం యునైటెడ్‌  డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(యూఎన్‌డీపీ)లో కొంతకాలం పనిచేశాడు. నైపుణ్యానికి అనుభవం కూడా తోడవ్వడంతో తాను అనుకున్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. డేనియల్‌ను సంప్రదించిన తొలి క్లయింట్‌ ఓ ఇంటికి ప్రహరీ గోడ కట్టాలని అడిగాడట. ముడిపదార్థాల వినియోగంపై అవగాహన పెరిగిందీ అప్పుడే! 2007లో ‘వాల్‌మేకర్స్‌’ కంపెనీ ఏర్పాటు చేశాడు. అప్పటికి అతడి వయసు  26 ఏళ్లు. గోడ నుంచి భవనాల నిర్మాణం దాకా వెళ్లాడు. ఒక్కో ఇల్లు రాజభవనంలా నిర్మించాడు. పనికిరాని వస్తువులు, బంకమట్టితో కట్టిన ఇల్లు అని చెప్తే గానీ తెలుసుకోని విధంగా తీర్చిదిద్దాడు. మవేలికరాలో నిర్మించిన ‘వల్సాలా కాటేజ్‌’ని 2009లో ‘ఎకో ఫ్రెండ్లీ హౌస్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు వరించింది. రాహుల్‌ మెహ్రోత్రా రచించిన ‘ఆర్కిటెక్చర్‌ ఇన్‌ ఇండియా’ పుస్తకంలోనూ ఈ ఇల్లు చోటు దక్కించుకోవడం విశేషం. ఆనాటి నుంచి డేనియల్‌ నిర్మాణశైలిపై ఎందరికో ఆసక్తి కలిగింది. తమకూ పర్యావరణహిత భవంతులను నిర్మించాలని అడిగే వారి  సంఖ్య పెరిగింది.

* పనికిరానిదంటూ లేదు..
ప్రతి ఇంటినీ ఓ కళాఖండంగా తీర్చిదిద్దాలని సంకల్పించుకుంటుంది డేనియల్‌ బృందం. వినూత్న డిజైన్లు ఎంచుకుంటాడాయన. ఇంటి చుట్టుపక్కల ఉన్న వ్యర్థాలను సేకరించి నిర్మాణంలో వినియోగిస్తాడు. ఇల్లు పూర్తయ్యేలోపు చుట్టూ ఉన్న వ్యర్థాలన్నీ మాయమైపోతాయి. అవన్నీ.. ఈ ఇంట్లో భాగమైపోతాయి. ఒక చోట వాషింగ్‌ మెషీన్లలో పనికిరాని వస్తువులతో గోడలు కట్టేశారు. వార్డ్‌రోబ్‌లు, కప్‌బోర్డులకు పనికిరాని మొద్దులు, కలప ఉపయోగించారు. సహజ సిద్ధమైన కాంతి లోనికి వచ్చేలా నిర్మాణం ఉంటుంది. ఇప్పటిదాకా దాదాపు 20 ప్రాజెక్టులు పర్యావరణహితంగా నిర్మించి ఔరా అనిపించుకున్నాడు డేనియల్‌. ఓవైపు తన ప్రత్యేకతను చాటుకుంటూనే.. మరోవైపు పుడమితల్లికి చేతనైన సాయం చేస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.

- బెజవాడ వెంకటేశ్వర్లు

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.