Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 82690
            [news_title_telugu_html] => 

ఇన్ఫోసిస్‌.. లాభాల్లో అదుర్స్‌

[news_title_telugu] => ఇన్ఫోసిస్‌.. లాభాల్లో అదుర్స్‌ [news_title_english] => Infosys Q4 net profit up 10 Percent [news_short_description] => గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ అంచనాలకు మించి రాణించింది.  ఏకీకృత నికర లాభంలో 10.5శాతం వృద్ది నమోదు చేసింది. మార్చి 31తో ముగిసిన [news_tags_keywords] => Infosys,quarter results,business [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => | https://www.youtube.com/embed/ZlwwJzOK-gs [news_videoinfo] => | https://www.youtube.com/embed/ZlwwJzOK-gs [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-13 00:17:05 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఇన్ఫోసిస్‌.. లాభాల్లో అదుర్స్‌ - Infosys Q4 net profit up 10 Percent - EENADU
close

తాజా వార్తలు

ఇన్ఫోసిస్‌.. లాభాల్లో అదుర్స్‌

బెంగళూరు: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ అంచనాలకు మించి రాణించింది.  ఏకీకృత నికర లాభంలో 10.5శాతం వృద్ది నమోదు చేసింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ. 4,078 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఇన్ఫీ ప్రకటించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ నికరలాభం రూ. 3,690 కోట్లుగా నమోదైంది. ఇక కంపెనీ ఆదాయం కూడా 19.1శాతం పెరిగి రూ. 21,539 కోట్లకు చేరినట్లు బీఎన్‌ఈ ఫైలింగ్‌ సందర్భంగా ఇన్ఫోసిస్‌ వెల్లడించింది.

ఇక 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరం గణాంకాలను చూసినట్లయితే.. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌ నికర లాభం 3.9శాతం తగ్గి రూ. 15,410 కోట్లుగా ఉంది. అయితే అదే సమయంలో ఆదాయం 17.2శాతం పెరిగి రూ. 82,675 కోట్లకు చేరింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7.5 నుంచి 9.5శాతం వృద్ధి సాధిస్తామని కంపెనీ ఈ సందర్భంగా అంచనా వేసింది.  

త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఇన్ఫీ షేర్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేరు ధర స్వల్పంగా 0.71శాతం లాభపడి రూ. 748 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో 0.63శాతం లాభంతో రూ. 747.85 వద్ద స్థిరపడింది. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.