
తాజా వార్తలు
రాంచీ: ‘ఫొని’ ప్రభావం అమిత్‌షానూ తాకింది. ఫొని అతి తీవ్ర తుపాను ఒడిశాలో తీరం దాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్‌లో నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచారాలను అమిత్‌షా రద్దు చేసుకున్నారు. ఆయనకు బదులుగా ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారని భాజపా అధికార ప్రతినిధి ప్రదీప్ సిన్హా తెలిపారు. ఈ రోజు సాయంత్రం కోడెర్మా, ఖుంటీ, రాంచీల్లో అమిత్‌షా పర్యటించాల్సి ఉంది. ఈ మూడు స్థానాలకు మే 6న పోలింగ్ జరగనుంది. కానీ, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అమిత్‌షా తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఒడిశాకు సమీపంలోని దుమ్కా, తూర్పు సింగుభుమ్, పశ్చిమ సింగుభుమ్ తదితర జిల్లాల్లో కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ రాంచీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఖుంటీ లోక్‌సభ నియోజవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా బరిలోకి దిగుతున్నారు. ఈ స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిగా కలిచరన్ ముండాను నిలిపింది . రాంచీలో భాజపా నుంచి కేంద్ర మాజీ మంత్రి సంజయ్ సేత్ పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి సుబోధ్ సేత్ నిలిచారు. కోండెర్మా లోక్‌సభ స్థానం నుంచి భాజపా తరఫున అన్నపూర్ణ దేవి, ఝార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) నుంచి మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరంది బరిలో నిలిచారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
