
తాజా వార్తలు
భేదాభిప్రాయాలతో ఆగిన షూటింగ్
హైదరాబాద్: సీనియర్ నటుడు రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ కథానాయికగా పరిచయం కాబోతున్న చిత్రం ‘టూ స్టేట్స్’ కోర్టు వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్ర దర్శకుడు వెంకట్ రెడ్డి నిర్మాత ఎం.ఎల్.వి సత్య నారాయణ (సత్తిబాబు)పై సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. ఈ సినిమాకు సంబంధించి దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని, తనకు తెలియకుండా నిర్మాత కథలో మార్పులు చేశారని ఆరోపించారు. సినిమా నుంచి తనను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని వెంకట్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు నిర్మాత సత్యనారాయణ ఈ నెల 30న హాజరై, వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇంకా 30 శాతం చిత్రీకరణ జరగాల్సి ఉండగా.. తనను కాదని వచ్చిన వేరే వారిపై (దర్శకత్వం వహించేందుకు) చట్టపరంగా చర్యలు తీసుకుంటానని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కిన చిత్రం ‘2 స్టేట్స్’. దీనికి తెలుగు రీమేక్‌గా అదే టైటిల్‌తో ‘టూ స్టేట్స్’ను రూపొందిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. దర్శక, నిర్మాతల మధ్య భేదాభిప్రాయాలతో సినిమా చిత్రీకరణ మధ్యలో నిలిచిపోయింది. దీంతో నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఈ డెబిట్‌కార్డులను బ్లాక్ చేయనున్న ఎస్బీఐ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
