
తాజా వార్తలు
హైదరాబాద్: సిద్దిపేట ఎమ్మెల్యే, తెరాస ముఖ్యనేత హరీశ్‌రావు తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజున (జూన్ 3) హైదరాబాద్, సిద్దిపేటలో తాను అందుబాటులో ఉండటం లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పుట్టినరోజున (జూన్ 3) శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీ అందర్నీ నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్ 3న నేను హైదరాబాద్‌లో కానీ, సిద్దిపేటలో కానీ ఉండటం లేదు. ముందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండాల్సి వస్తోంది. నా పట్ల మీ ప్రేమను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా చాటాలని కోరకుంటూ.. మీ అభిమానానికి మరోసారి తలవంచి నమస్కరిస్తున్నా..’’ అని హరీశ్‌రావు ట్విటర్లో పేర్కొన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వదిలేశారు..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
