
తాజా వార్తలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో భాజపా ఓ తీవ్రవాద సంస్థలా వ్యవహరిస్తోందని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఆ పార్టీ పక్క రాష్ట్రాల నుంచి గూండాలను దిగుమతి చేసుకుంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికార దాహంతో భాజపా నాయకులు రాష్ట్రంలో ప్రజల మధ్య వర్గ విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. ‘‘భాజపా ఓ తీవ్రవాద సంస్థలా వ్యవహరిస్తోందని లోక్సభ ఎన్నికల సమయం నుంచి మేం చెబుతూనే ఉన్నాం. బిహార్, ఉత్తరప్రదేశ్ నుంచి కిరాయి గూండాలను బెంగాల్లో దించుతున్నారు. తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని టీఎంసీ కీలక నేత, కోత్కతా మహానగర మేయర్ ఫిర్హాద్ హకీమ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇటీవల రాష్ట్రంలోని భాట్పాడా ప్రాంతంలో భాజపా, టీఎంసీ వర్గాల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనల గురించి ప్రస్తావిస్తూ.. ఆ ప్రాంతం నుంచి బెంగాలీలను ఖాళీ చేయించాలనే ప్రయత్నం జరుగుతోందని హకీమ్ ఆరోపించారు. రాష్ట్రం మొత్తం భాట్పాడాలా మారనివ్వబోమని.. భాజపా ఆగడాలను అడ్డుకొని తీరతామన్నారు. టీఎంపీ వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా స్పందించింది. రాష్ట్రాన్ని టీఎంసీ పాకిస్థాన్లా మార్చే ప్రయత్నం చేస్తోందని ఘాటు విమర్శలు చేసింది. జైశ్రీరాం జపం చేయడానికి కూడా ఇక్కడి ప్రభుత్వం అనుమతించకపోవడం దారుణమని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. బెంగాల్లో లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రారంభమైన హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరు పార్టీల మధ్య రోజురోజుకీ వివాదాలు ముదురుతుండడంతో ఘర్షణ వాతావరణానికి తెరపడడం లేదు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
