
తాజా వార్తలు
బర్మింగ్‌హామ్: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో మెరుపులు మెరుపిస్తున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. అతడు నమ్మశక్యం కాని సంకల్ప బలం ప్రదర్శిస్తున్నాడని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ వన్డేల్లో 26వ శతకం, ప్రపంచకప్‌లో నాలుగో శతకం బాదిన సంగతి తెలిసిందే.
‘ప్రపంచకప్‌లో ఒక ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలం. ఎప్పుడు దూకుడుగా ఆడాలో, ఎప్పుడు ఇన్నింగ్స్ నిర్మించాలో రోహిత్‌కు బాగా తెలుసు. అతడి సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం అమోఘం. ప్రపంచకప్‌లో ఓపెనింగ్ చాలా కీలకం. జట్టు కోసం అతడా బాధ్యత మోస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై అతడి దూకుడు, శతకం టీమిండియాకు ముందుగానే జోరు అందించింది. దక్షిణాఫ్రికాపై మాత్రం నిలకడగా శతకం చేశాడు. రెండూ ముఖ్యమే. శిఖర్ ధావన్ లేని లోటును చక్కగా పూడ్చుతున్నాడు’ అని శ్రీకాంత్ అన్నారు.
‘కేఎల్ రాహుల్ శుభారంభాలు అందిస్తున్నాడు. బంగ్లాపై 77 పరుగులకు ఔటయ్యాడు. అతడు కచ్చితంగా శతకం చేస్తాడు. మెల్లగా విశ్వాసం పెంచుకుంటున్నాడు. టాప్ఆర్డర్లో కీలకంగా మారుతున్నాడు. భారత్ అన్ని మ్యాచుల్లోనూ సమష్టిగా రాణిస్తోంది. టాప్ఆర్డర్లో రోహిత్, కోహ్లీపై ఒత్తిడి తగ్గుతోంది. రాహుల్, పంత్ ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లకూ ఇదే వర్తిస్తుంది. బుమ్రా మ్యాచ్‌లను చక్కగా ముగిస్తున్నాడు. భువి సైతం అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. చివరి మ్యాచ్‌లో బంగ్లా పోరాట స్ఫూర్తి ఆకట్టుకుంది’ అని క్రిష్ అన్నాడు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- శరణార్థులకు పౌరసత్వం
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
