close

తాజా వార్తలు

సమంత ‘ఓ బేబీ’ కటౌట్‌ అదిరిందిగా!

హైదరాబాద్‌: అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతుంది. భారీ కటౌట్లు, బాణాసంచా పేలుళ్లతో థియేటర్ల వద్ద వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఆ అభిమానం హీరోలకే కాదు తనకు ఉందంటున్నారు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత. సమంత నటించిన చిత్రం ‘ఓ బేబి’ ఈ నెల 5న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని దేవి థియేటర్‌లో ఆమె అభిమానులు కొందరు అగ్ర హీరోలతో సమానంగా భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. దీంతో అటుగా వెళ్లే ప్రేక్షకులను ఆ కటౌట్ ఆకర్షిస్తూ సమంత ఓ బేబి కాదు.. బిగ్ బేబి అనేలా ఉందనిపించుకుంటోంది. తొలిసారిగా సమంతకు భారీ కటౌట్ ఏర్పాటు చేయడంతో చిత్ర బృందం కూడా దీనిపై హర్షం వ్యక్తం చేసింది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.