close

తాజా వార్తలు

కదిలే రైల్లో ఫొటో షూట్‌.. వీడియో వైరల్‌..!

న్యూయార్క్‌: ఓ మహిళ కదిలే రైల్లో ఫొటోలు తీసుకుని ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. తనకు తానే సెల్ఫ్‌ టైమర్‌ పెట్టుకుని ఫొటోలు తీసుకుంది. ఇది చూసిన తోటి ప్రయాణికులు ముక్కున వేలేసుకొన్నారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె ఆత్మవిశ్వాసానికి ఫిదా అవుతున్నారు. 
అసలేం జరిగిందంటే... న్యూయార్క్‌కు చెందిన జెస్సికా జార్జ్‌ అనే మహిళ ఆదివారం రైల్లో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో రైల్లో ప్రయాణికులు రద్దీ తక్కువగా ఉండటంతో ఆమె తన ఫోన్‌లో సెల్ఫ్‌ టైమర్‌ ఆన్‌ చేసి తనకు తానే ఫొటోలు తీసుకుంది. ఆ తర్వాతి స్టేషన్‌లో ప్రయాణికులు రైల్లోకి ఎక్కారు. అయినా ఆమె ఫొటోలు తీసుకోవడం ఆపలేదు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు ఆమెను ఒకింత ఆశ్చర్యంగా చూశారు. ఆమె ఆత్మవిశ్వాసానికి ఫిదా అయ్యారు. సాధారణంగా రద్దీ ప్రదేశాల్లో ఇలా ఫొటోలు తీసుకోవడం అరుదుగా కనిపిస్తుంటుంది. ఈ తతంగాన్ని అక్కడున్న మరో ప్రయాణికుడు వీడియో తీసి ట్విటర్‌లో పోస్టు చేశాడు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇప్పటి వరకూ 8.7 మిలియన్‌ మంది ఈ వీడియోను వీక్షించారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి..!

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.