Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001076
            [news_title_telugu_html] => 

మోడల్‌ను చంపి..భర్తకు ఓలా డ్రైవర్‌ మెసేజ్‌

[news_title_telugu] => మోడల్‌ను చంపి..భర్తకు ఓలా డ్రైవర్‌ మెసేజ్‌ [news_title_english] => Ola driver kills model texts husband from her phone [news_short_description] => బెంగుళూరుకు చెందిన నగేశ్‌ అనే ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ ఓ మోడల్‌ను హత్య చేసి రూ.5లక్షలు కావాలని ఆమె భర్తకే మెసేజ్‌ చేశాడు. జులై 31న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన పూజా సింగ్‌ డె(32) మోడల్‌, ఈవెంట్‌ మేనేజర్‌ [news_tags_keywords] => Kempegowda International Airport,ola cab,ola driver killed model [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 18:32:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మోడల్‌ను చంపి..భర్తకు ఓలా డ్రైవర్‌ మెసేజ్‌ - Ola driver kills model texts husband from her phone - EENADU
close

తాజా వార్తలు

మోడల్‌ను చంపి..భర్తకు ఓలా డ్రైవర్‌ మెసేజ్‌

రూ.5లక్షలు కావాలని డిమాండ్‌


 

బెంగుళూరు: బెంగుళూరుకు చెందిన నగేశ్‌ అనే ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ ఓ మోడల్‌ను హత్య చేసి రూ.5లక్షలు కావాలని ఆమె భర్తకే మెసేజ్‌ చేశాడు. జులై 31న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన పూజా సింగ్‌ డె(32) మోడల్‌, ఈవెంట్‌ మేనేజర్‌. ఈమె జులై 30వ తేదీన బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోల్‌కతా నుంచి బెంగుళూరుకు వచ్చారు. కార్యక్రమం పూర్తైన తర్వాత అక్కడి నుంచి కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ను బుక్‌ చేసుకున్నారు. క్యాబ్‌ డ్రైవర్‌ నగేశ్‌ ఆమెను విమానాశ్రయానికి తీసుకెళ్లకుండా ఎవరూ లేని నిర్మానుశ్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె దగ్గర ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్‌, విలువైన వస్తువులను లాక్కున్నాడు. అనంతరం ఆమె తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. 
అంతటితో అతని అత్యాశ తీరలేదు. పూజ మొబైల్‌ నుంచి రూ.5లక్షలు కావాలని డిమాండ్‌ చేస్తూ ఆమె భర్త ఫోన్‌కు మెసేజ్‌ చేశాడు. దీంతో ఆమె భర్త కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజ మృతదేహాన్ని విమానాశ్రయం సమీపంలో గుర్తించిన స్థానికులు బెంగుళూరు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో విచారణ చేపట్టిన వారికి కోల్‌కతా పోలీసులు సమాచారం ఇవ్వడంతో కేసును ఛేదించగలిగారు. నిందితుడు ఆమెను తీవ్రంగా గాయపరచడంతో ఆమె మృతి చెందిందని పోలీసులు పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.