
తాజా వార్తలు
1. బోటులో మొత్తం 73మంది: వెల్లడించిన అధికారులు బోటు ప్రమాదంపై అధికారిక వర్గాల తాజా సమాచారం ప్రకారం మొత్తం 73 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకూ 8 మృత దేహాలు లభ్యమైనట్టు అధికారులు వెల్లడించారు. 26 మంది సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. మరో 39 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి |
2. సురక్షితంగా బయటపడింది వీరే! గోదావరిలో బోటు మునిగిన ఘటనలో 16 మంది సురక్షితంగా బయటపడ్డారు. పాపికొండల విహారయాత్రకు పర్యాటకులను తీసుకెళ్లిన బోటు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు మందం వద్ద నదిలో మునిగిపోయింది. ఘటన జరిగిన సమయంలో బోటులో 63 మంది పర్యాటకులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 16 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. వారి వివరాలివీ..! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
3. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఘటనపై సీఎం జగన్ అధికారులతో మాట్లాడుతూ రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రులు, అధికారులు అండగా నిలవాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
4. బోటు ప్రమాదం.. రంగంలోకి నేవీ సిబ్బంది తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బోటు ప్రమాదం నేపథ్యంలో నేవీ సిబ్బంది రంగంలోకి దిగనున్నారు. గల్లంతైన పర్యాటకులతో పాటు బోటు ఆచూకీని ఈ బృందం కనిపెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు విశాఖలోని ఐఎన్ఎస్ డేగా నేవీ ఎయిర్‌స్టేషన్ నుంచి డోర్నియర్ యుద్ధ విమానం బయల్దేరింది. ఇందులో డైవింగ్ సిబ్బందితో పాటు జెమినీ బోటు, సంబంధిత పరికరాలు ఉన్నాయి. ఇప్పటికే గోదావరి కొనసాగుతున్న సహాయక చర్యల్లో ఈ బృందం పాల్గొననుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
5. బోటు ప్రమాదంపై మోదీ, కేసీఆర్ దిగ్భ్రాంతి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నా. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి’’ అని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
6. హ్యూస్టన్లోమోదీతో వేదిక పంచుకోనున్న ట్రంప్? అమెరికాలో ఈ నెల 22న జరగనున్న ‘హౌదీ మోదీ’ సభలో ప్రధాని మోదీతో కలిసి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేదిక పంచుకోనున్నారని సమాచారం. ఆ దిశగా అక్కడి భారత సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్వేతసౌధం నుంచి అధికారిక ఆమోదం కోసం వేచి చూస్తున్నామని అక్కడి భారతీయ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య విభేదాలకు తెరపడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
7. కేటీఆర్ నిర్ణయం.. విజయ్ దేవరకొండ హర్షం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని మంత్రి కేటీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కథానాయకుడు విజయ్ దేవరకొండ ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్‌ను పోస్ట్ చేస్తూ.. ‘ఈ నిర్ణయం నా ముఖంపై చిరునవ్వు తీసుకొచ్చింది. మనం అడిగాం, ప్రభుత్వం మన వెంటే ఉండి మద్దతుగా నిలిచింది. పవర్.. బాధ్యత.. యాక్షన్. ఇలాంటి నాయకులంటే నాకు ఇష్టం’ అని ట్విట్లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
8. బోటులో వెళ్లిన పర్యాటకుల వివరాలివే! గోదావరిలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైనవారికోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలిస్తున్నాయి. రాయల్ వశిష్ఠ అనే ప్రైవేటు బోటులో హైదరాబాద్, వరంగల్, విశాఖ, రాజమండ్రి ప్రాంతాల నుంచి పర్యాటకులు పాపికొండల విహారానికి వెళ్లారు. ఇప్పటి వరకు తెలిసిన ప్రకారం రాయల్ వశిష్ఠ బోటులో వెళ్లిన ప్రయాణికుల వివరాలివీ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
9. హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు! నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా రాబోతోంది. వీరిద్దరూ ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలతో సక్సెఫుల్ కాంబినేషన్ అనిపించుకున్నారు. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా సినిమా టైటిల్ ఖరారు చేయలేదని పేర్కొన్నారు. డిసెంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
10. భారత్xదక్షిణాఫ్రికా:తొలి టీ20 వర్షార్పణం ఆరు నెలల తర్వాత అభిమానుల మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకున్న టీమ్ ఇండియా కల, ప్రపంచకప్ చేదు అనుభవాన్ని ఈ మ్యాచ్‌తో చెరిపేసుకోవాలనుకున్న దక్షిణాఫ్రికా ఆశకు వరుణుడు అడ్డుగా మారాడు. వరుణుడి ప్రతాపానికి టాస్ కూడా సాధ్యపడలేదు. ధర్మశాల వేదికగా జరగాల్సిన భారత్ x దక్షిణాఫ్రికా తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
