close

తాజా వార్తలు

భాజపాపై శివసేన ఆరోపణలు

ముంబయి: భాజపా మిత్రపక్షమైన శివసేన ఎన్నికల తరుణంలో ఆపార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ‘భాజపా పుల్వామా ఉగ్రదాడి, ఐఏఎఫ్‌ బాలాకోట్‌ దాడులను ఎన్నికల అంశాలుగా ఉపయోగించుకుంది. ఒకవేళ ఈ ఘటనలు జరగకపోయి ఉంటే భాజపాకు 300 స్థానాలు వచ్చేవా?’ అంటూ శివసేన అధికార పత్రిక సామ్నాలో ప్రశ్నించింది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో శివసేన, భాజపా పొత్తులో పోటీలో దిగనున్నప్పటికీ సామ్నా ద్వారా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవల ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మాట్లాడుతూ.. ‘బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరం మళ్లీ ప్రారంభమైంది. ఈ సారి ఏదైనా జరిగితే బలంగానే సమాధానమిస్తాం’ అని ఆయన చేసిన వ్యాఖ్యల వెనక రాజకీయ ప్రభావం ఉందంటూ ఆరోపణలు చేశాయి. దీంతో ఆ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రభావితం అయినట్లు తాము భావించడం లేదని శివసేన వెల్లడించింది. 

భాజపా, శివసేన కూటమి మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే సీట్లను పంచుకోనున్న విషయం తెలిసిందే. ఈ సీట్ల కేటాయింపుల విషయంపై శివసేన నాయకుడు సంజయ్‌రౌత్‌ మాట్లాడుతూ.. మహారాష్ట్ర చాలా పెద్ద రాష్ట్రం. ఇందులో ఉన్న 288 శాసనసభ స్థానాలను షేరింగ్‌ చేయడం అంటే అది భారత్‌, పాక్‌ విభజన కన్నా కష్టతరమైన పని అంటూ అభిప్రాయపడ్డారు. శివసేనకు 144 స్థానాలు కూడా కేటాయించకపోతే రెండు పార్టీల పొత్తు రద్దు కావచ్చని ఇప్పటికే సెప్టెంబర్‌ 19న రౌత్‌ అన్నారు. 2014 ఎన్నికల్లో శివసేన, భాజపా రెండూ విడివిడిగానే పోటీ చేసినప్పటికీ చివరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో మళ్లీ ఒక్కటయ్యాయి. మహారాష్ట్రలో అక్టోబర్‌ 21న ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు అక్టోబర్‌ 24న వెలువడనున్నాయి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.