close

తాజా వార్తలు

విజయవాడలో యువతిపై అత్యాచారం

ఆలస్యంగా వెలుగులోకి..

కరెన్సీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే: ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ మాచవరం స్టేషన్‌ పోలీసుల కథనం ప్రకారం.. మొవ్వకు చెందిన ఓ యువతి నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తోంది. ఆమె తన అన్నయ్యతో కలిసి గుణదలలో నివసిస్తోంది. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వినోద్‌ అనే వ్యక్తి గత నెల నాల్గోతేదీన ఇంట్లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే సోదరుడ్ని చంపేస్తానని, ఆమె ఫొటోలు అంతర్జాలంలో పెడతానని బెదిరించాడు.  ఈ బెదిరింపులకు తట్టుకోలేక మనస్తాపానికి గురైన యువతి ఈనెల 26న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను కాపాడారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.