close

తాజా వార్తలు

టీమిండియా భారీ విజయం

రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన దక్షిణాఫ్రికా

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆదివారం భారీ విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఏడాది తర్వాత స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి అద్భుత విజయం నమోదు చేసింది. 395 పరుగుల లక్ష్యంతో శనివారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పర్యాటక జట్టు 191 పరుగులకు కుప్పకూలింది. ఈ నేపథ్యంలో టీమిండియా 203 పరుగుల భారీ తేడాతో తొలి టెస్టులో గెలుపొందింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 11/1తో ఆదివారం చివరి రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ తొలి సెషన్‌లో పెవిలియన్‌కు వరుస కట్టారు. మ్యాచ్‌ ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే అశ్విన్‌.. డిబ్రుయిన్‌(10)ను బౌల్డ్‌ చేయగా తర్వాతి ఓవర్‌లో మహ్మద్‌ షమి బవుమా(0)ను పెవిలియన్‌ చేర్చాడు. ఆపై వెనువెంటనే డుప్లెసిస్‌(13), డికాక్‌(0)లను కూడా షమి బౌల్డ్‌ చేయగా దక్షిణాఫ్రికా 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

అనంతరం జడేజా.. ఫిలాండర్‌(0), కేశవ్‌ మహారాజ్‌(0), మార్‌క్రమ్‌(39)లను ఔట్‌ చేయడంతో టీమిండియా గెలుపు లాంఛనమే అయింది. అయితే ముత్తుసామి(49; 108 బంతుల్లో 5x4), డేన్‌పీట్‌(56; 107 బంతుల్లో 9x4 1x6) పట్టుదలగా ఆడి 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో షమి 60వ ఓవర్‌లో పీట్‌ను బౌల్డ్‌ చేసి టీమిండియాకు మరోసారి బ్రేక్‌ ఇచ్చాడు. చివరగా రబాడ(18; 19 బంతుల్లో 3x4, 1x6) క్రీజులోకి వచ్చి మెరుపు బ్యాటింగ్‌ చేసినా షమి బౌలింగ్‌లోనే కీపర్‌కు క్యాచ్‌ వెనుదిరిగాడు. షమి 10 ఓవర్లలో 35 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం. అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 323/4 పరుగుల వద్ద డిక్లేర్‌ చేయగా రోహిత్‌(127) సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. కాగా రోహిత్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

స్కోరు వివరాలు:
భారత్‌ తొలి ఇన్నింగ్స్: 502/7 డిక్లేర్‌ (మయాంక్‌ 215, రోహిత్‌ 176; మహారాజ్‌ 189/3)
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 431 ఆలౌట్‌ (ఎల్గర్‌ 160, డికాక్‌ 111, అశ్విన్‌ 145/7)
భారత్‌  రెండో ఇన్నింగ్స్‌: 323/4 డిక్లేర్‌ (రోహిత్‌ 127, పుజారా 81, మహారాజ్‌ 129/2)
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: 191 ఆలౌట్‌ (డేన్‌పీట్‌ 56, ముత్తుసామి 49, షమి 35/5)



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.